Yevam Movie Review & Rating: చాందిని చౌదరి ని పోలీస్ గా చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసిన యేవం దర్శకుడు!

yevam movie Review by 18 fms 9 e1718364726475

చిత్రం: యేవమ్ ,

విడుదల తేదీ : జూన్ 14, 2024,

నటీనటులు: చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, జై భ‌ర‌త్ రాజ్, అషు రెడ్డి తదిత‌రులు,

దర్శకుడు: ప్ర‌కాశ్ దంతులూరి,

నిర్మాతలు : న‌వ‌దీప్, ప‌వ‌న్ గోప‌రాజు,

సంగీత దర్శకుడు: కీర్త‌న శేష్, నీలేష్ మాండ‌లపు,

సినిమాటోగ్రఫీ: ఎస్వి. విశ్వేశ్వ‌ర్,

ఎడిటింగ్: సృజ‌న అడుసుమిల్లి,

మూవీ: యేవమ్ రివ్యూ  ( Yevam Movie Review) 

యంగ్ బ్యూటీ చాందిని చౌద‌రి పోలీస్ ఆఫీసర్ గా  ఫిమేల్ లీడ్ లో న‌టించిన తాజా చిత్రం ‘యేవ‌మ్’ చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది.  అయితే, ఆ క్యూరియాసిటీని సినిమాలో ఎంతవరకూ మెయింటెయిన్  తెలుసు కోవాలని ఉందా !

 క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ యేవం  సినిమా నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సిన్మా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష లో చదివి తెలుసుకొందామా !

yevam movie Review by 18 fms 7

కధ పరిశీలిస్తే (Story Line): 

సౌమ్య‌(చాందిని చౌద‌రి) పోలీస్ ట్రైనీ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ గా వికారాబాద్ పోలీస్ స్టేష‌న్ లో కొత్తగా జాయిన్ అవుతుంది. అందులోనే ఎస్సైగా ఉంటాడు అభిరామ్(జై భ‌ర‌త్ రాజ్). ఒక‌రోజు ఓ అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతుంది.

సౌమ్య ఈ మ‌ర్డ‌ర్ కేస్ ని  వేరొక కేసుతో సంబంధం ఉన్న‌ట్లుగా గుర్తించి యుగంధ‌ర్(వశిష్ట సింహా) ఈ హ‌త్య‌లకు కార‌ణ‌మ‌ని తెలుసుకుంటుంది. సినిమా స్టార్స్ ను ఇష్ట‌ప‌డే అమ్మాయిల‌ను ట్రాప్ చేసి అతడు ఈ హ‌త్య‌లు చేస్తుంటాడు.

హంత‌కుడిని సౌమ్య ఎలా ప‌ట్టుకుంటుంది ?,

ఈ కేసును సాల్వ్ చేయ‌డంలో అభిరామ్ సౌమ్య కు ఎలా సాయ‌ప‌డ్డాడు?,

ఈ క‌థ‌లో హారిక‌(అషు రెడ్డి) ఎవరు ? ఆమె  పాత్ర ఏమిటి?,

అస‌లు యుగంధ‌ర్ ఎవ‌రు ? ఎందుకు అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు? ,

ఈ హ‌త్య‌ల వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి?,

సౌమ్య రిస్క్ చేయవలసిన అవశ్యం ఏమిటి ? , 

అనే ప్రశ్నలు ఇంటరెస్ట్ ని క్రియేట్ చేసి జవాబులు తెలుసుకోవాలని ఉంటే వెంటనే మి దగ్గర లొని  సినిమా దియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

yevam movie Review by 18 fms 2

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఈ యేవం సినిమా కధనం (స్క్రీన్ – ప్లే)  థ్రిల్ల‌ర్ సినిమాల‌కు కావాల్సిన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అందించీనా, రిపీటెడ్ షాట్స్, స్లో  సీన్స్ ప్రేక్ష‌కుల‌కు కొంతమేరకు చిరాకు తెప్పించినా క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎండ్ వరకూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది.

ఈ సినిమా కధ బాగున్నా,  క‌థ‌నాన్ని (స్క్రీన్ – ప్లే) మ‌రింత బ‌లంగా రాసుకోవాల్సింది. ఈ థ్రిల్ల‌ర్ సినిమాలో విల‌న్ ఎవ‌ర‌నే విష‌యాన్ని ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో చూపించడం, వలన రెండవ అంకం (సెకండాఫ్) పై మరింత ఆస‌క్తి పెంచింది. చాందిని చౌద‌రి త‌న పాత్ర‌లో బాగా లీనమైంది. అయితే, కొన్ని సీన్స్ లో ఆమె పాత్ర‌కు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం వలన ఆ సీన్స్ అంతగా డ్రామా పండించలేకపోయాయి.

వ‌శిష్ట సింహాకు స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకాస్త ఎక్కువ‌ ఇవ్వాల్సింది. స్క్రీన్ మీద కనిపించినంతవరకూ తన నటన, వాక్ ధాటితో నెక్ట్ లెవెల్ కి తీసికెళ్లిపోయాడు.  థ్రిల్ల‌ర్ సినిమాల‌కు కావాల్సిన ఎంగేజింగ్ మ్యూజిక్ స్కోర్ కొంతవరకూ బాగుంది అనిపిస్తుంది.

yevam movie Review by 18 fms 3

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

రైట‌ర్, డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్ దంతులూరి  తను రాసుకొన్న కధ పేపర్ మీద బాగున్నా, స్క్రీన్ మీద కు వచ్చేటప్పటికి థ్రిల్ మిస్ అయ్యింది. ఇంకా వివరంగా చెప్పాలంటే యేవమ్  సినిమాను ఆస‌క్తిక‌ర క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ గా మ‌ల‌చే ప్రయత్నం లో ఎక్కడో గాడి తప్పాడా అనిపిస్తుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో పాటు మ‌రింత మెరుగైన స్క్రిప్టు ఉండి ఉంటే, ఈ సినిమా రిజ‌ల్ట్ వేరే విధంగా ఉండేది.

చాందిని చౌద‌రి తొలిసారి ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించింది. చ‌క్క‌టి ప‌ర్ఫార్మెన్స్ తో ఆమె ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటుంది.

జై భ‌ర‌త్ రాజ్ కూడా త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. మొదటి సినిమా లంపసింగి లో కూడా పోలీస్ పాత్రనే. ఈ యేవం లో కూడా పోలీస్ పాత్రనే చేశాడు.

ఈ సినిమాలో వ‌శిష్ట సింహా త‌న న‌ట‌నతో సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తాడు. నెగెటివ్ రోల్ నా, పాజిటివ్ రోల్ నా అనేది పక్కన పెడితే,  అత‌డి ప‌ర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివ‌రీ యుగంధర్ పాత్రకు సూప‌ర్ గా కుదిరాయి.

మిగిలిన పాత్రలలో  గోపరాజు రమణ, దేవి ప్రసాద్, అషు రెడ్డి తదిత‌రులు తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించారు.

yevam movie Review by 18 fms 4

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

కీర్త‌న శేష్, నీలేష్ మాండ‌లపు ల సంగీతం పరవాలేదు. ముఖ్యంగా కీర్తన అందించిన BGM చాలా సీన్స్ కి వాల్యూ యాడ్ చేసింది. ఇలాంటి సస్పెన్స్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నే ప్రాణం. కొన్ని సీన్స్ ల్  శ్లోకాలు OST గా చేయడం బాగున్నాయి.

ఎస్వి. విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్వాలేద‌నిపించినా కొన్ని షాట్స్ బాగున్నాయి. ముఖ్యంగా నైట్ సీన్స్ కి లైటింగ్ బాగుంది.

సృజ‌న అడుసుమిల్లి ఎడిటింగ్ వ‌ర్క్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ రిపిట్ గా చూసినట్టు ఉన్నాయి. లాగ్ తగ్గించి ఉంటే బాగుణ్ణు.

నిర్మాతలు న‌వ‌దీప్, ప‌వ‌న్ గోప‌రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా సీన్స్ రిచ్ లుక్ లో ఉన్నాయి.

yevam movie Review by 18 fms

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

 ‘యేవ‌మ్’ మూవీ ప్రేక్షకులను అయోమయం కి గురి చేసే మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.  ఓ సాధార‌ణ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ కధ ని ఇంటెన్సివ్ గా చేద్దాం అనుకొన్న దర్శకుడు రెగ్యులర్ కధనం (స్క్రీన్ – ప్లే) తో నడిపి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా ప‌ర్ఫార్మెన్స్ లు ఆక‌ట్టుకున్నా, వారి పాత్ర‌లను డిజైన్ చేసిన తీరు సరిగా కుదర లేదు. రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రిపీట్ సీన్స్ కార‌ణంగా ‘యేవ‌మ్’ సినిమా అందరి  ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌ పోవచ్చు.

క్రైమ్ థ్రిల్లర్ సినిమా లు ఇష్ట పడే ప్రేక్షకులకు ఈ ‘యేవ‌మ్’ బాగా నచ్చుతుంది.

చివరి మాట: మంచి చేడుల నడుమ ‘యేవ‌మ్’ !

18F RATING: 2.75  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *