మూవీ: యాత్ర 2
విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2024,
నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి నండూరి,
దర్శకుడు : మహి వి రాఘవ్,
నిర్మాత: శివ మేక,
సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్,
సినిమాటోగ్రఫీ: మధీ,
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని,
యాత్ర 2 రివ్యూ (Yatra2 Movie Review):
తమిళ హీరో జీవా, మళయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రల్లో యాత్ర సినిమా దర్శకుడు మహి వి రాఘవ మరో సారీ అప్పటి యాత్ర కు కొనసాగింపుగా “యాత్ర 2” తీశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి అంటే 2009 నుండి 2019 లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనల లోనుంచి దర్శకుడు తనకు నచ్చిన వైఎస్ ర్ కాంగ్రీస్ పార్టీ కార్య కర్తలు మెచ్చే విదంగా తీసిన ఈ యాత్ర 2 సినిమా ఈ శుక్రవారం విడుదల అయ్యింది. మరి తెలుగు సినీ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

కధ పరిశీలిస్తే (Story Line):
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) తన రాజకీయ వారసుడిగా, తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి ని (జీవా) 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ ఈ కథ మొదలవుతుంది. ఆ ఎన్నికల్లో జగన్ మరియు ప్రోగ్రాస్ పార్టీ గెలవడం, వైఎస్సార్ రెండవ సారీ ఆంధ్ర సీఎం అవ్వడం చూపిస్తారు.
ఐతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాల మరణం తర్వాత ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులలో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘ఓదార్పు యాత్రను’ తమ పార్టీ ఆదిస్థానం ఆపేయమనడంతో జగన్ ప్రోగ్రాస్ పార్టీని వీడి తన తండ్రి బాటలో నడవాలని తండ్రి పేరుమీద ప్రత్యేక పార్టీ పెట్టి, బై ఎలక్షన్స్ లో గెలుస్తాడు.
ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జగన్ పై సీబీఐ దాడులు జరుగుతాయి. జగన్ అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) సీఎం అవ్వడం, మొదటిసారి రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం వంటి సంఘటనలు జరుగుతాయి.
అప్పుడు తండ్రి లానే తను కూడా పాదయాత్రను ఎలా చేశాడు ?,
ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ రాజకీయ పార్టీని ప్రారంభించాడు?
ఆ తర్వాత అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌ను ఎలా అరెస్ట్ చేశారు?
అరెస్ట్ తర్వాత వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి?
వైయస్సార్, జగన్ పాత్రల్లో మమ్ముట్టి, జీవా ఎలా చేశారు?
రాజకీయాలు పక్కన పెట్టి సినిమాగా చూస్తే ఎలా ఉంది?
మహి వి రాఘవ్ ప్రజలకు తెలిసిన కధనే సినిమా గా ఎలా తీశారు?
చివరి ఆకరికి 2019 లో జగన్ సీఎం ఎలా అయ్యాడు ? వంటి ప్రశ్నలకు సమాధానాలే ఈ యాత్ర 2 సినిమా కధ.
కధనం పరిశీలిస్తే (Screen – Play):

దర్శకుడు మహి వి రాఘవ తీసుకున్న వాస్తవిక కథాంశం బాగున్నప్పటికీ పాత్రలలో అగ్రిస్సివ్ నెస్ లేకుండా ఎమోషనల్ గా రాసుకొన్న కథనం (స్క్రీన్ – ప్లే ) మాత్రం సింపుల్ గా స్లోగా సాగుతుంది. ఇలాంటి సక వాస్తవిక పొలిటికల్ కధాలకు కొంచెం హై యాక్షన్ ఎపిసోడ్స్ లో కధనం సాగితే ప్రేక్షకులు గ్రిప్పింగ్ గా చూస్తారు. కానీ ఈ యాత్ర సినిమాకు మహీ మాత్రం స్లో ఎమోషనల్ డ్రామా తోనే సింపతీ గేయన్ చేద్దాంఅని చేయడం వలన జగన్ అభిమానులకు నచ్చయిటున్ది కానీ సామాన్య ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కారు.
మెయిన్ కధనం లోకి వెళ్తే మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) లోని కొన్ని సీన్స్ అలాగే రెండవ అంకం (సెకండాఫ్) స్టార్టింగ్ సీన్స్ రిపీట్ చూస్తున్నట్టు గా ఉంది ఆసక్తికరంగా సాగలేదు. జగన్ – ప్రత్యర్థి పార్టీ నాయకుల మధ్య వచ్చే కొన్ని రాజకీయ సన్నివేశాలు కూడా చాలా రెగ్యులర్ గానే అనిపిస్తాయి.
ఓవరాల్ గా దర్శకుడు మహీ తను ఏమి చెప్పాలి అనుకొన్నాడో అదే కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా రిచ్ గా ఎలివేట్ చేశాడు. అలాగే కధనం ( స్క్రీన్ ప్లే) విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక క్లైమాక్స్ కూడా అందరూ ఊహించిన విధంగానే ముగిసింది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

మహి వి రాఘవ 2019 లో చేసిన యాత్ర సినిమా బాగుండటం తో అప్పట్లో మంచి పేరు సంపాదించాడు. మరలా ఇప్పుడు ఆ యాత్ర కి కొనసాగింపుగా యాత్ర2 అంటూ వై ఎస్ జగన్ రాజకీయ జీవితం లొని కొన్ని ఘట్టాలను మాత్రమే అవికూడా జగన్ కు, జగన్ పార్టీకి అనుకూలంగా ఉండే సంఘటనలనే తీసుకొని ఓక కధ గా వ్రాసుకొని దానికి దర్శకత్వం వహించడం సినిమాగా బాగుంది. వాస్తవిక కధగా కాకుండా ఈ యాత్ర 2 ని సినిమా కధ గా చూస్తే మహీ పాస్ అయినట్టే !
మహి వి రాఘవ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన తడబడ్డారు.
హీరో జీవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గా చాలా బాగా నటించాడు. చాలా వరకూ ఫేస్ ఎక్స్ప్రెసెన్స్ తోనే మెథడ్ యాక్టింగ్ చేస్తూ కధలొని పాత్రలో లీనమవుతూ రియల్ లైఫ్ లోని జగన్ హవా భావాలను చక్కగా పాలికించాడు అని చెప్పవచ్చు. ఆ పాత్ర కి జీవా ఎంపిక పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు.
వై ఎస్ ర్ గా లెజెండరీ నటుడు మమ్ముట్టి ‘యాత్ర 2’ లో కూడా కనిపిస్తారు. ఆయన కూడా తన సహజ నటనతో అద్భుతంగా నటించారు. అదే విధంగా ఈ సినిమాలో సోని
యా పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కూడా చాలా బాగా నటించింది. మేడమ్ పాత్రలో వదిగిపోయింది.
జగన్ రాజకీయ ప్రచ్యర్ది చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ కూడా చక్కగా నటించాడు. ఎక్కడ ఓవర్ చేయకుండా బాగా సెటిల్డ్ గా ఉన్నంతలో చక్కగా నటించాడు.
అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తూ నటులందరూ ఆకట్టుకున్నారు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న సీన్లు మరియు ఎమోషన్స్ అండ్ పాత్రల ఎలివేషన్స్ కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతూ ఆకట్టుకుంటాయి.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. కానీ పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
ఎడిటర్ శ్రవణ్ కటికనేని కొన్ని అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. తెలిసిన కధని ప్రేక్షకులు గ్రిప్పింగ్ గా చూడాలి అంటే స్క్రీన్ ప్లే తో గాని, ఎడిటింగ్ స్కిల్స్ తో ఆకట్టుకోవాలి. కానీ యాత్ర 2 సిన్మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం నాశిరకమైన పని చేసింది అని చెప్పవచ్చు.
మధీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. తక్కువ రోజులలో ఘాట్ చేయడం వలన కొన్ని సీన్స్ ఫెడ్ అయినట్టు కనిపించినా చాలా సీన్స్ మాత్రం చాలా రిచ్ గా కనిపించాయి.
నిర్మాత శివ మేక పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పొలిటికల్ మైలేజ్ కోసం చేశారు కాబట్టి ఖర్చుకి ఎక్కడ తగ్గకుండా బాగానే చేశారు.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
కధలు, సినిమాలు వాస్తవం కాదు అని తెలిసినా వాటిని చదువుతూ, చూస్తూ సేదతీరుతాము. అందులోని డ్రామాకు కానీ, పాత్రలకు కానీ మనం కనెక్ట్ అయితే ఎమోషనల్ గా ఫీల్ అయినా సంతోశంగా దియేటర్ బయటికి వస్తాము. కధా రచయిత, దర్శకుడు ఉద్దేశం ఏదైనా కావచ్చు, కధను చదివే సినిమాను చూసే ప్రేక్షకులు మాత్రం కొత్త కధలను, గతములో చూడానివి చదవనివి ఎక్కువ ఇష్ట పడతారు.
కానీ ఈ యాత్ర 2 కధ వస్తవమా ? అంటే కాదు అని, అయితే కల్పితమా అంటే కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే మహీ V రాఘవ ఎంచుకున్న కధ వాస్తవికమే కానీ, తనకు నచ్చిన కొన్ని సంఘటనలతోనే పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా జగన్ అభిమానులకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు నచ్చే విధంగా ఈ ‘యాత్ర 2’ ని చేశాడు అని చెప్పవచ్చు.
ఇక తెలిసిన ఈ కధ లో జగన్ పొలిటికల్ గ్రాఫ్ తో పాటు వైఎస్ఆర్ జగన్ మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ ఉన్న సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే, బీజీఎం, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఐతే, ఈ సినిమాలో కొన్నిసీన్స్ స్లోగా సాగడం, అలాగే రొటీన్ గా సాగే కొన్ని పొలిటికల్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి.
కధనం స్లో ఫేజ్ లో సాగుతున్నప్పుడు మంచి నటులు ఉంటే వారి నటనతో అలాంటి సీన్స్ ని బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా మలుస్తారు. మమ్ముట్టి – జీవా తమ నటనతో సినిమాని మాక్షిమమ్ సీన్స్ ని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ఓవరాల్ గా ఈ ‘యాత్ర 2’ చిత్రం వైసీపీ అభిమానులను, మరియు ఎమోషనల్ డ్రామా ని యిస్థపడే సినీ ప్రేక్షకులను చాలా బాగా మెప్పిస్తుంది.