Yamadheera Telugu Movie Teaser Out : యమధీర మూవీ టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ !

IMG 20240314 WA0123 e1710411879719

 కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టీజర్ ప్రముఖ నటులు & ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారు లాంచ్ చేయడం జరిగింది.

IMG 20240314 WA0104

 

ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన తన స్నేహితుడు యాక్టర్, ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది అని వేదాల శ్రీనివాస్ గారు తెలిపారు.

IMG 20240314 WA0064

 

ఈ సందర్భంగా అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ… తన స్నేహితులు వేదాల శ్రీనివాస్ గారు కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు.

IMG 20240314 WA0121

కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ గారు ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం అని అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే దూకుడు ని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.

ప్రొడ్యూసర్ : వేదాల శ్రీనివాస్

తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.

టెక్నికల్ టీం :

కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్, మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర, ఎడిటింగ్ : సి రవిచంద్రన్, సంగీతం : వరుణ్ ఉన్ని, కథ & దర్శకత్వం : శంకర్ ఆర్,పిఆర్ఓ : మధు విఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *