Why  Aadikeshava Release Postponed?  పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల ‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 24న భారీస్థాయిలో విడుదల !

adikesav director producer e1698828903190

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సితార సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. అలాగే జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘సిత్తరాల సిత్రావతి’, ‘హే బుజ్జి బంగారం’, ‘లీలమ్మో’ విడుదలై విశేష ఆదరణ పొందాయి.

adikesav hero

కొంత సేపటి క్రితం చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాత ఎస్. నాగవంశీ ఆడికేశవ మూవీ రిలీస్ కి  కొత్త తేదీని ప్రకటించారు. ముందుగా మేకర్స్ ఈ ఆదికేశవ చిత్రాన్ని నవంబర్ 10 న విడుదల చేస్తున్నట్టు చెప్పారు ఆ విదంగానే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన విడుదల డేట్ మారుస్తున్నాము అని మీడియా ముందు చెప్పారు.. ఆ కారణాలు ప్రొడ్యూసర్ నాగ వంశీ వివరిస్తూ…

ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడంలేదు. అందుకే నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన ‘ఆదికేశవ’ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.

adikesav release postponed to 24 th Nov

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, “ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా.. ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు సినిమాల వసూళ్ళపై ప్రభావం పడటం మేం గమనించాం. పైగా ఇప్పుడు సెమీ ఫైనల్స్ వస్తున్నాయి. ఇండియా ఫైనల్ కి వెళ్ళి, వరల్డ్ కప్ గెలుస్తుందనే అంచనాలు అందరిలో ఉన్నాయి. అందుకే ఈ సమయంలో విడుదల చేయడం కరెక్ట్ కాదని చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించి నవంబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది” అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌, మాస్‌ ఆడియన్స్‌ని కూడా ఈ సినిమా అలరిస్తుందని అన్నారు.

‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *