నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వీరసింహారెడ్డి.
భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వీరసింహారెడ్డి మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
రేపు మద్యాహనం సంధ్య 35 mm థియేటర్ లో వీర సింహా రెడ్డి సినిమా మూడవ సాంగ్ రిలీజ్ కి భారీ ప్లాన్ చేసింది నిర్మాణ సంస్థ.
అయితే ప్రస్తుతం వీర సింహా రెడ్డి సెట్స్ నుండి చిన్న లీక్ వచ్చి సోషల్ మీడియా లో వీరల అవుతున్న ఫోటో ఒకటి ఉంది. అందరూ ఆ ఫోటో గురించే మాట్లాడుకొంటూ ఆ ఫోటోని షేర్ మెడ షేర్ చేస్తూ ట్రెండ్ శృస్తినచ్చారు. ఈ ఫోటో మా ప్రతినిది కి ఫార్వార్డ్ రూపం లో వచ్చేటప్పటికి ఏంటా అని ఆర్య తీస్తే తెలిసింది ఏంటంటే..
విషయం ఏమిటంటే, నిన్న ఈ వీర సింహా రెడ్డి మూవీ యొక్క సెట్స్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళి కొంత టైమ్ బాల కృష్ణ తో గడిపారట. ఈలా పవన్ కళ్యాణ్ బాలయ్య ల కలయిక వెనుక ఉన్న స్టోరీ ఇప్పటికే మీకు అర్దం అయ్యి ఉంటుంది.
ఈ నెల 27 న ఆహా ఓటిటి లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ గా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆరోజున ఆయన ఎపిసోడ్ చిత్రీకరణ జరుగనుంది. ఆ ఎపిసోడ్ కి సంఅం బంధించిన కొన్ని విశయాలు చర్చల కోసం ఆహా అన్ స్టాపబుల్ షో క్రియేటివ్ హెడ్ బి వి ఎస్ రవి ఆద్వర్యం లో ఈ మీట్ జరిగినట్టు సమాచారం.
ఇది ఈ ఫోటో వెనుక ఉన్న కధ, ఇది తెలియని చాలా మంది ఎవరికి నచ్చిన కధ వారు రాసుకొని ప్రచారం లో పెట్టేశారు !. అసల విశయం గాలికి వదిలేశారు !