గ్రాండ్ గా ‘సైతాన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఇలాంటి ఇంటెన్స్ స్టోరీ చెప్పాలంటే అలాంటి పదాలు అవసరం: మహి వి రాఘవ్ 

saithan trailer launch2 e1686023612519

ప్రముఖ దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ‘మీరు దీనిని నేరం అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటారు’ అనే థీమ్ లో సైతాన్ సాగుతుందని ఆల్రెడీ తెలిపారు.

థీమ్ కి తగ్గట్లుగానే ట్రైలర్ కూడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ తమ మనుగడ కోసం క్రైమ్స్ మొదలు పెట్టింది అనేది ఈ చిత్ర కథ. ఇందులో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటించారు.

saithan web series 1

ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. సైతాన్ అనేది క్రైమ్ డ్రామా. ఇంతకు ముందు మేము డిస్ని ప్లస్ హాట్ స్టార్ కోసం సేవ్ ది టైగెర్స్ కోసం పనిచేశాం. సైతాన్ అనేది కంప్లీట్ గా డిఫెరెంట్ ప్రాజెక్ట్. క్రైమ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే వారి కోసం టార్గెట్ చేసి తెరకెక్కించాం.

saithan trailer launch

గతంలో నేను నాలుగైదు చిత్రాలు తెరకెక్కించా. ఏ చిత్రానికి కూడా న్యూడిటీ, అభ్యంతరకర డైలాగ్స్ లాంటి సెన్సార్ సమస్య రాలేదు. కానీ సైతాన్ లో అన్నీ ఉన్నాయి. మీరు ట్రైలర్ చూస్తే.. ఇలాంటి బలమైన కథ చెప్పేందుకు ఆ పదాలు ఉపయోగించాల్సి వచ్చింది.
 
ఇక మా నటీనటుల గురించి చెప్పాలంటే వారు ఎంతో ఫ్యాషన్ తో వర్క్ చేశారు. ఈ కథకు తగ్గట్లుగా ముందుగానే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళతో కలసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని మహి వి రాఘవ్ అన్నారు.

saithan trailer launch3

ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించిన రిషి మాట్లాడుతూ.. నాకు తెలుగులో ఇదే తొలి ప్రాజెక్ట్. నేను నటించిన కవుల్దారి తెలుగులోకి రీమేక్ అయింది. నాకు తెలుగు ఇండస్ట్రీతో స్పెషల్ రిలేషన్ ఉంది. నాకు ఈ సిరీస్ లో స్ట్రాంగ్ రోల్ ఇచ్చిన మహి వి రాఘవ్ గారికి థ్యాంక్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఆయన అన్ని కోణాల్లో ఇంటెన్స్ గా చూపించారు. సైతాన్ సిరీస్ ఇంటెన్స్ గా, హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది.

saithan trailer launch2

నటి దేవియాని మాట్లాడుతూ.. ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు మీడియా వాళ్లందరికీ నా థ్యాంక్స్. సేవ్ ది టైగర్స్  తర్వాత తక్కువ సమయంలోనే సైతాన్ రిలీజ్ అవుతోంది. సేవ్ ది టైగర్స్ తరహాలోనే సైతాన్ కూడా ఇంకా భారీ సక్సెస్ అవుతుంది. ఈ సిరీస్ లో నేను ఎంతో కష్టమైన పాత్రలో నటించాను.

ఈ అవకాశం ఇచ్చిన మహి వి రాఘవ్ సర్ కి థ్యాంక్స్. జూన్ 15 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో సైతాన్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని కోరింది. జూన్ 15 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో సైతాన్ స్ట్రీమింగ్ మొదలు కానుంది.

https://www.youtube.com/watch?v=XP6-yZoDQio

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *