Weapon Movie Glimps out: గుహన్ వంటి విజన్ ఉన్న డైరక్టర్ చేస్తున్న డిఫరెంట్ మూవీ ‘వెపన్’ : గ్లింప్స్ ఆవిష్కరణలో వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్

 

మిర్చి, బాహుబలి సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, అశ్విన్స్, జైలర్ చిత్రాల్లో మెప్పించిన యాక్టర్ వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా జరిగిన ప్రెస్ మీట్‌లో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, నిర్మాత మన్సూర్, పివిఆర్ హెడ్ మీనా, రాజీవ్ పిళ్లై, డైరెక్టర్ గుహన్ సెన్నియప్పన్ తదితరులు పాల్గొన్నారు.

IMG 20230905 WA0186

సత్యరాజ్ మాట్లాడుతూ ‘‘వెపన్’ లాంటి ఓ సినిమాను తీయాలంటే నటీనటులకంటే ముందుగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్ వాళ్లే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్ కు ప్రాధాన్యత అని నా అభిప్రాయం. వెపన్ సినిమా విషయానికి వస్తే చాలా మంచి టీమ్ కుదిరింది డిఫరెంట్ కాన్సెప్ మూవీ. నిర్మాతలైతే మరో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టి సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. డైరెక్టర్ గుహన్ అయితే సరికొత్త విజన్ తో సినిమాను ఆవిష్కరించారు.

IMG 20230905 155858

వసంత్ రవి ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు. తన నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాన్యా హోప్, రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై ఇలా అందరూ చక్కగా వర్క్ చేశారు. బాహుబలి కంటే ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్ లో నటించాను. అయితే చక్కగా ఫైట్ మాస్టర్ డిజైన్ చేయటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశాలను పూర్తి చేశాం. త్వరలోనే సినిమాను మీ ముందుకు తీసుకు రావటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అన్నారు.

IMG 20230905 WA0180

నిర్మాత మన్సూర్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ లో వస్తోన్న తొలి సినిమా. సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

IMG 20230905 WA0179

పివిఆర్ హెడ్ మీనా మాట్లాడుతూ ‘‘వెపన్’ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. మంచి యాక్షన్ పార్ట్, విజువల్స్ త పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇందులో 1300కిపైగా సీజీ షాట్స్ ఉన్నాయి. ఏఐ టెక్నాలజీని ఉపయోగింటం విశేషం’’ అన్నారు.

IMG 20230905 WA0185

వసంత్ రవి మాట్లాడుతూ ‘‘వెపన్’ వంటి సినిమాపై చేయటం.. దాని సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నాం. మీనాగారు, మన్సూర్ గారు ఇతర నిర్మాతలు చాలా ప్రేమతో మంచి ఎఫర్ట్ పెట్టి సినిమాను రూపొందిస్తున్నారు.

IMG 20230905 163258 scaled e1693921613310

వెపన్ కథ వినగానే మనం చూసిన సూపర్ హీరోస్ సినిమాల్లా అనిపించింది. గుహన్ దీన్ని ఎలా చేస్తాడా? అని అనుకున్నాను. అలాగే ఇందులో సత్యరాజ్ గారు సూపర్ హ్యూమన్ లా కనిపిస్తారనగానే హ్యపీగా అనిపించింది. అదే సమయంలో ఆయనలాంటి యాక్టర్ తో చేయటం అంటే చిన్న విషయం కాదు. నిజంగానే షూటింగ్ సమంయలో చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్ తో సినిమా రూపొందింది’’ అన్నారు.

IMG 20230905 WA0183

రాజీవ్ మీనన్ మాట్లాడుతూ ‘‘నేను సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా మీ అందరికీ సుపరిచితుడినే. అప్పుడప్పుడు యాక్టర్ గానూ అలరించే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యాక్టర్ గా కనిపించటానికి ఒప్పుకుంటున్నాను. డైరెక్టర్ గుహన్ నా శిష్యుడే. తను వసంత్ తో కలిసొచ్చి కథను నెరేట్ చేయగానే ఇదేదో వంద కోట్ల సినిమాలా ఉందే దీన్ని వీళ్లెలా చేస్తారా? అని ఆలోచనలో పడ్దాను. పెద్ద సినిమా, కొత్త ఆలోచనతో వస్తుంది’’ అన్నారు.

IMG 20230905 WA0181

చిత్ర దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ ‘‘వెపన్’ సినిమాను ఇంత గొప్పగా చేస్తున్నానంటే కారణం నిర్మాతలు. వారు మేకింగ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను అడిగినవన్నీ ఇవ్వటంతో సినిమాను చక్కగా పూర్తి చేస్తూ వస్తున్నాం. డీసీ, మార్వెల్ తరహా సూపర్ హ్యుమన్స్ కాన్సెప్ట్ తో వెపన్ సినిమాను తెరకెక్కిస్తున్నాం. కథ వినగానే సత్యరాజ్ గారు, వసంత్ రవిగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

IMG 20230905 155846 scaled e1693921803933

 

ఇక రాజీవ్ మీనన్ గారు నా గురువుగారు. ఆయనతో కలిసి సినిమా చేయటం మరచిపోలేని అనుభూతి. ఇందులో వండర్‌పుల్ యాక్షన్ సీక్వెన్సులున్నాయి. సినిమాను కేరళలోని వాగమన్ లో చిత్రీకరించాం. నటీనటులందరూ రిస్క్ తీసుకుని నటించారు. తాన్యా హోప్ గారి క్యారెక్టర్ లో చాలా కీలకమైన మలుపులుంటాయి. అవేంటనేది సినిమలో చూడాల్సిందే. ఇక మీనాగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.

IMG 20230905 WA0182

తాన్యా హోప్ మాట్లాడుతూ ‘‘వెపన్’ సినిమా నాకెంతో ప్రత్యేకం. నా క్యారెక్టర్ లో చాలా ట్విస్టుంటాయి. దాన్ని స్క్రీన్ పై చూస్తేనే అర్థమవుతుంది. మంచి కాన్సెప్ట్త్ తో వస్తున్న సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

IMG 20230905 WA0178

రాజీవ్ పిళ్లై మాట్లాడుతూ ‘‘వెపన్ వంటి సినిమా చేయటం అంత సులభం కాదు. ఓ వైపు మెసేజ్ తో పాటు మంచి యాక్షన్ సీక్వెన్సులుంటాయి. దర్శక నిర్మాతలు ఎంతో విజన్ తో మంచి మెసేజ్ నిస్తూ సినిమాను మీ ముందుకు తీసుకు రాబోతున్నారు’’ అన్నారు.

DSC 3483 1600x1067

నటీనటులు:

సత్యరాజ్, వసంత్ రవి, రాజీవ్ మీనన్, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై, యషికా ఆనంద్, మైమ్ గోపి, కణిత, గజరాజ్, సయ్యద్ సుభాన్, భరద్వాజ్ రంగన్ తదితరులు

సాంకేతిక వర్గం:

దర్శకత్వం: గుహన్ సెన్నియ్యపప్పన్

నిర్మాణం: మిలియన్ స్టూడియో

సంగీతం: గిబ్రాన్

సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్

ఎడిటర్: నష్

ఆర్ట్: సుబేందర్ పిళ్లై

యాక్షన్: సుదేశ్

పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణీ కందుకూరి (బియాండ్ మీడియా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *