సుడిగాలి లా నటనలో దూసుకు పోవాలనుకుంటున్న మరో ఎన్నారై *వెంకట్ దుగ్గిరెడ్డి కి గాలోడు ఎంత వరకూ హెల్ప్ చేశాడో చదవండి!

SAVE 20221201 135500

 

*గుడ్* బిగినింగ్ విత్ *గాలోడు*

పేరు తప్ప పారితోషికం అవసరం

లేదంటున్న *నెల్లూరీయుడు*

 

 కోట్లకు పడగలెత్తినా రాని “కిక్” సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి. “గాలోడు” చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ ఆప్యాయంగా అందిస్తున్న అభినందనలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చిన్నపిల్లాడిలా సంబరపడిపోతున్నారు ఈ నెల్లూరీయుడు.

SAVE 20221201 135454

    ఘన విజయం సాధిస్తున్న “గాలోడు” చిత్రంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సుడిగాలి సుధీర్, స్టార్ కమెడియన్ సప్తగిరి కాంబినేషన్ లో నటించి మెప్పించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నదని అంటున్న వెంకట్ దుగ్గిరెడ్డి స్వస్థలం నెల్లూరు. చిన్నప్పటి నుంచి ఈయనకు నటనంటే తగని మక్కువ.

SAVE 20221201 135508

  పాతికేళ్ల క్రితం నెల్లూరు నుంచి అమెరికా వెళ్లి… ప్రవాసాంధ్ర ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగిన దుగ్గిరెడ్డి… నటన ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని తేల్చి చెబుతారు. ఎందరికో ఉపాధి కల్పిస్తూ, పన్ను రూపంలో కోట్లాది రూపాయలు చెల్లించే తనకు… నటుడిగా పేరు తప్ప పారితోషికం అవసరం లేదని అన్నారు.

SAVE 20221201 135443

 “గాలోడు” చిత్రంలో తనకు లాయర్ పాత్ర ఇచ్చి.. నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేయించిన దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్ల, ఈ చిత్రంలో హీరోయిన్ ఫాదర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసిన తన బెస్ట్ ఫ్రెండ్ రవి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు…

పలు రకాల పాత్రల ద్వారా నటుడిగానూ తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ఎన్నారై బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *