మూవీ: వాల్తేరు వీరయ్య
విడుదల తేదీ : జనవరి 13, 2023
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, క్యాథరిన్, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, సత్యరాజ్, బాబీ సింహా, జాన్ విజయ్, నాసర్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు
దర్శకుడు : కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
సంగీత దర్శకులు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ (Waltair Virayya Movie Review):
ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత జరిగిన ఢామేజీని కవర్ చేయడానికి ఆలుపులేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వం లో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో చేసిన సినిమా వాల్తేర్ వీరయ్య.
ఈ వాల్తేరు వీరయ్య సినిమా ఓపెనింగ్ నుండి ప్రేక్షకులు వింటేజ్ చిరంజీవిని చూస్తారు అని చెప్తూ కొత్తదనం కంటే పాతదనమే ఎక్కువుంటుందని ఆడియన్స్ ని ప్రిపేర్ చేశాడు చిత్ర దర్శకుడు బాబీ.
మెగాస్టార్ చిరంజీవి – రవితేజ – శృతి హాసన్ – ప్రకాష్ రాజ్ – బాబీ సింహా – సత్యరాజ్ – నాజర్ వంటి సినీయర్ నటులతో ఈ సంక్రాంతి కి ఈ వాల్తేరు వీరయ్య సినిమా వస్తుంది కాబట్టి సినిమా మీద ప్రేక్షకులలో భారీ ఆంచానాలు ఏర్పడ్డాయి.
అలాంటి భారీ అంచనాల మద్య ఈ వాల్తేరు వీరయ్య చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీ టీం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందామా !
కధను పరిశీలిస్తే (story line):
వాల్తేరు వీరయ్య (చిరంజీవి) తన జాలర పేట జనాలకు అండగా ఉంటూ ఓ కేసు కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించిన సాక్షిని + సాక్ష్యాలను ప్రవేశ పెట్ట లేక మరో వాయదా రావాలి అంటే పీపీ కి వీరయ్య పాతిక లక్షలు లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఆ డబ్బు కోసం వీరయ్య ఓ సహసోపేతమైన పని ఒప్పుకుంటాడు.
ఇంతకీ అన్నీ డబ్బులు ఇచ్చే ఆ పని ఏమిటీ ?,
అసలు వీరయ్య ఎవరి కేసు కోసం కోర్టులో ఫైట్ చేస్తున్నాడు ?,
ఈ మధ్యలో అతిధి (శ్రుతి హాసన్) ట్రాక్ ఏమిటి ?,
అసలు వీరయ్య గతంలో ఏమి చేసేవాడు ?,
వాల్తేరు వీరయ్యకి విక్రమ్ సాగర్ కి మద్య గొడవ ఏమిటి ?
ఎసీపీగా వచ్చిన విక్రమ్ సాగర్ వీరయ్యను ఎందుకు అడ్డుకున్నాడు?,
ట్రైలర్ లో చూపినట్టు వీరయ్య మలేసియా ఎందుకు వెళతాడు ?
ఇంతకీ వీరయ్య స్మగ్లర్ నా, దొంగ నా, పోలీస్ నా లేక జాలర పేట లీడర్ నా ? అనే ప్రశ్నలకు జవాబులు తెలీసుకోవాలి అదే టైమ్ లో ఈ ప్రశ్నలు సినిమా మీద ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తే వెంటనే దియేటర్ కి వెళ్ళి వీరయ్య సినిమా చూడండి.
18 f టీం లఅనే మీరు కూడా మీ చిన్న పిల్లలు తో సహ అందరూ దియేటర్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు.
కధ లో కధనం పరిశీలిస్తే (screen – Play):
వీరయ్య – రవితేజ పాత్రలు, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు ముఖ్యంగా వీరయ్య గా మెగా స్టార్ నటన నా భూతో నా వింటేజ్-చిరు అన్నట్టు అద్భుతంగా డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. కథనం విషయంలో బాబీ చాలా వరకూ సక్సెస్ అయినట్టే.
అయితే, పాత్రల మధ్య ఎమోషన్స్ ను ఇంకా కొంచెం డీటైల్ గా సీన్స్ రాసుకొని ఉంటే సినిమా రిజల్ట్ మరో లెవెల్ లో ఉండేది. ఇంకా సినిమా అంతా వీరయ్య పాత్ర చుట్టూ అల్లుకోవడం వలన, మిగిలిన పాత్రలు ఎక్కువ అవ్వడం వలన ఆ పాత్రలలో నటించిన నటులు డైలాగ్స్ లేకుండా లేక ఒకటి ఆరా మాటలతో సరిపెట్టుకోవాలసి వచ్చింది.
ఇక రెండవ అంకం ( సెకండాఫ్) లో మాస్ మహరాజా రవితేజ పాత్ర ఎంట్రీ తో సినిమా ని మరో మెట్టు ఎక్కించినా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయిందా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ట్రాక్ లో రెండు వెరీయేసన్స్ ని రాయడం స్క్రీన్ ప్లే కి ఆయువుపాట్టు లా ఉంది.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
దర్శకుడు బాబీ మెగాస్టార్ ని వీరయ్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించి తాను అనుకొన్న విదంగా ప్రెసెంట్ చేశాడు. వీరయ్య కేరక్టర్ షేడ్స్ ను, శ్రుతి హాసన్ తో సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని రవితేజ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు బాబీ చాలా బాగా తీర్చిదిద్దారు.
సినిమా కధలో ఎన్నో పాత్రలు ఉన్నా అన్నీ పాత్రలకు సినీయర్ నటుల చేత నటింపచేసినా వీరయ్య పాత్ర ముందు మిగిలిన అన్నీ పాత్రలు తెలిపోయాయి అని చెప్పాలి. దర్శకుడు కధ కు న్యాయం చేస్తూ తన అభిమాన హీరో ని ఎలా చూడాలి అనుకొన్నాడో అలా వీరయ్య కేరక్టర్ ని రాసుకొని మెగా స్టార్ చిరు ని వీరయ్య గా మలిచిన విధానం చాలా బాగుంది.
వీరయ్య కధలో హీరో మెగాస్టార్ చిరంజీవి వదిగిపోయి తనదైన కామెడీ టైమింగ్ తో పాత కాలపు సినిమాలు అయిన ముఠా మేస్త్రి, అత్తకు మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి పాత్రల మేనరిజమ్స్ తో ఇరగ తీశాడు.
చిరు గత రెండు సినిమాల కంటే ఈ సినిమా లో చాలా స్లిమ్ గా గ్లామర్ గా కనిపిస్తూ అద్భుత కామిడీ యాక్టింగ్ తో మెప్పించాడు. అలాగే ఇక వీరయ్య పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారు అని చెప్పవచ్చు.
కొన్ని చోట్ల రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. చిరు – శ్రుతి హాసన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.
మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఏసిపి విక్రమ్ సాగర్ గా రవితేజ కూడా చాలా బాగా నటించాడు. మాస్ రాజా లుక్ & స్టైల్ లో డెఫెరెంట్ గా కనిపిస్తూ ఫైట్స్ లోనూ పూనకాలు లోడింగ్ సాంగ్ లోనూ నటన ఎరగదీసి నాడు.
హీరోయిన్ గా శ్రుతి హాసన్ కూడా డబుల్ షేడ్ లో బాగా చేసింది. శ్రుతి పాత్రలోని సర్ప్రైజ్ ఎలిమెంట్ ని “క్రాక్” సినిమా లో దర్శకుడు గోపీచంద్ మలినేని ఎలా ఆవిష్కరించాడో ఇక్కడ వీరయ్య లో కూడా దర్శకుడు బాబీ అలాగే ఆవిష్కరించాడు. పాటలలోనూ, ఫైట్స్ లోనూ తనదైన స్టైల్ లో శృతి నటించి మెప్పించింది.
ఇంకా ఊర్వశి రౌతేలా చేసిన బాస్ పార్టీ స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా చేశాడు.
క్యాథరిన్ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ , సత్యరాజ్, బాబీ సింహా ,జాన్ విజయ్, రాజేంద్రన్ ఉన్నంతలో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు కానీ, వీరయ్య పాత్ర ముందు అందరూ నటి నటులు అతిది పాత్రలకె పరిమితం అయ్యారు.
వీళ్లు కాక ఈ సినిమాలో సుబ్బరాజు, ప్రభాస్ శీను, నాజర్, శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, ప్రదీప్ రావత్, సప్తగిరి, కమెడియన్ ప్రవీణ్ తదితరులు ఎందరో మహా నటులు ఉన్నా ఎవ్వరినీ సరిగ్గా వాడలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వీరయ్య విజృంబించాడు కాబట్టి మిగిలిన నటుల సైలెంట్ అయిపోయారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. దేవి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది అని చెప్పవచ్చు.
ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు.
ఎడిటర్ నిరంజన్ బాగానే చేశారు కానీ ఇంకా సినిమాలోని స్లో సీన్స్ ను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది.
నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్ లో భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
18f మూవీస్ టీం ఒపీనియన్:
పూనకాలు లోడింగ్ అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య పాత్ర లో మెగా స్టార్ బాగా ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా చిరంజీవి గత రెండు సినిమాలు సరైన రిసల్ట్ ఇవ్వక మెగా ఫ్యాన్స్ డీలా పడిన టైమ్ లో పూనకాలు లోడింగ్ అంటూ వచ్చిన వీరయ్య పాత్ర మెగా ఫాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చింది.
అలాగే ఇంట్రస్ట్ గా సాగే మెగాస్టార్ – రవితేజ క్యారెక్టరైజేషన్స్ మరియు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ అండ్ చిరు కామెడీ టైమింగ్, మెయిన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్ కి ఫుల్ పూనకాలను ఇస్తోంది.
టాగ్ లైన్: మెగా ఫాన్స్ కి పూనకాలే !
18f Movies రేటింగ్: 3 .25 / 5
* కృష్ణ ప్రగడ.