తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు అంటే కొత్త సినిమా తప్ప మరొకటి ఉండదు. ప్రతి పెదవాడికి తక్కువ ఖర్చులో వినోదం దొరకాలి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తలచి, ఎప్పటిదో అయినా పాత యాక్ట్ ప్రకారం సినిమా రెట్లు ఫిక్స్ చేశారు సుమారు రెండు సంవత్సరాల క్రితం.

ఆ టైమ్ లో చిరంజీవి, ప్రభాస్ మహేష్ బాబు అమరావతి వెళ్ళి వేడుకొంటే సినిమా రిలీజ్ కి ముందు ఓక అర్జీ పెట్టుకోండి, కొన్ని నియమాలు ప్రకారం రెట్లు పెంచాలో వద్దో మా అధికార్లు చెప్తారు అని చెప్పి కాపీ కూడా ఇవ్వకుండా పంపించేశారు అని ఇండిస్ట్రీ టాక్.

ప్రస్తుతం ఆ ముచ్చట ఎందుకు అంటే ఇప్పుడు 2023 సంక్రాంతి కి చిరంజీవి బాలకృష్ణ సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఆ రెండు సినిమాలు ఇండిస్ట్రీ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం కొంచెం భారీ బడ్జెట్ సినిమాలే అంటున్నారు.
ఆ రెండు సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి నిర్మించిన నిర్మాణ సంస్థ ఒక్కటే కావడం తో సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ లో పోటీలేక ఫాన్సీ ఆఫర్లు రాలేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇంకా ఈ రెండు సినిమాలకు పోటీగా దిల్ రాజు వారసుడు, యు వి వారి కళ్యాణం కమనీయం కూడా సంక్రాంతి కి రిలీజ్ అవుతుండడం తో బి సి సెంటర్లలో దియేటర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకే డిస్థిబుటర్స్ ఫాన్సీ ఆఫర్ ఇవ్వలేదు అంటున్నారు.

ఈ విశయం అర్దం చేసుకొన్న మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు లాభాలు రావాలంటే టికెట్ రేట్లు పెరగడం ఒక్కటే మార్గం అని తలచి అమరావతి బాట పట్టారు. 6 th న వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ ని ఒంగోలు లో, 8 th న వాల్తేర్ వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోను ఏర్పాటు చేశారు.

ఈ రెండు సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్ లు ఆంధ్ర సినీ అభిమానులకోసం ఏర్పాటు చేశాము అని చెప్తూ, నిన్న మైత్రి అధినేతలు ఆంధ్ర అధికారులను కలిసి, సంక్రాంతి సీజన్ కాబట్టి టికెట్ రెట్లు కొంచెం పెంచుకొనే వెసులుబాటు ఇవ్వండి అని ప్రాధేయ పడినట్టు సమాచారం.
ఇంకా ఆంధ్రప్రదేశ్ సర్కార్ లో తమకు తెలిసిన మంత్రి వర్యులు ద్వారా సిఎం జగన్ వద్ద కూడా రాయభారం జరుపుతున్నట్టు బొగట్ట. ఇలా తమకు అందుబాటులో ఉన్న మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు మైత్రి నేతలు. ఈ ప్రయత్నాలలో బాగంగా అమరావతి వెళ్లి సిఎమ్ పేషీ లో ఈ మేరకు దరఖాస్తు చేసి వచ్చారు. సిఎమ్ఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి ప్రస్తుత సంక్రాంతి సినిమాల పరిస్థితి, బడ్జెట్, ఇవన్నీ వివరించి వచ్చినట్లు తెలుస్తోంది.

సిఎమ్ జగన్ తో మాట్లాడి ఒకటి రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని సిఎమ్ఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మాకు అందిన సమాచారం మేరకు, టికెట్ ధరలు మరీ ఎక్కువ పెంపు వుండకపోవచ్చు అంటూ మాక్షిమం 50 రూపాయల పెంపు మాత్రమే వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు వుండకపోతే సినిమాలకు పెట్టిన పెట్టుబడి డబ్బులు రికవరీ రావడం కష్టం అవుతుంది అని నిర్మాతల తరుపున రాయభారం నడుపుతున్న రాజకీయ పెద్ద సిఎం ఓ లో చెప్పుకు వచ్చారు అంట.

ఇలా ఎంతోకొంత అంటే, యాభై రూపాయలు పెంచడం ద్వారా కూడా పండగ నాలుగు రోజుల్లో ఎక్కువ రెవెన్యూ కనిపించెే అవకాశం వుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య ల రెండు సినిమాలకు ఒకేలా టికెట్ రేట్ పెంచితే ఏ గొడవా రాదు, రెండు గ్రూపులు సంతృప్తిగా వుంటాయి. ఫ్యాన్స్ నుంచి ఏ విమర్శలూ వుండవు.

కానీ చిరంజీవి జగన్ కి కావలసిన వారు కాబట్టి వీరయ్య కు ఎక్కువ పెంచి, బాలయ్య టిడిపి ఎంఎల్ఏ కాబట్టి, వీరసింహారెడ్డి కి పెంచకుండా లేదా తక్కువ పెంచితే ఫాన్స్ మధ్యలో పెద్ద యుద్దమే జరుగుతుంది. చూడాలి ఆంధ్ర సిఎం ఏమి చేస్తారో ?

చిరంజీవి, బాలయ్య సినిమా ల గోల ఇలా వుంటే సంక్రాంతి పండగ కు మరో మూడు సినిమాలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాతగా విజయ్ వారసుడు, అజిత్ తెగింపు, యు వి వారి చిన్న సినిమా కళ్యాణం కమనీయం.

ఈ మూడు సినిమాల నిర్మాతలకు టికెట్ రెట్లు పెంపు ఆలోచనలు వున్నట్లు వినిపించడం లేదు, కనిపించడం లేదు. చూడాలి జగన్మోహన మాయ ఎలా ఉంటుందో !
* కృష్ణ ప్రగడ.