సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ లో ఈవెంట్లో స్టెప్పులేయనున్న వాల్తేరు వీరయ్య భామ. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా !

urvasi rautala ఇన్ సంతోషం అవార్డ్స్ 2022 e1670162765791

 

సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి రంగం సిద్ధమవుతోంది. 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో ది బెస్ట్ చిత్రాలను గుర్తించి ఆయా సినిమాల్లో భాగమైన వారికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తోంది సంతోషం సంస్థ. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలు అన్నింటికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తున్నారు.

కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది మిస్ కాకుండా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న సురేష్ కొండేటి ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.

urvasi rautala ఇన్ సంతోషం అవార్డ్స్ 2022 6
ఒక బాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం సరిగ్గా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి ఆమె ఎవరు అనే విషయాన్ని రివీల్ చేసింది, ఆమె ఇంకెవరో కాదు, బాలీవుడ్ సెన్సేషన్ ఊర్వశి రౌతేలా,

urvasi rautala ఇన్ సంతోషం అవార్డ్స్ 2022 1

ఊర్వశితో ఈసారి సంతోషం ఫిలిం అవార్డ్స్ లో పర్ఫామెన్స్ చేయించబోతున్నారు. బాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలలో భాగమైన ఊర్వశీ రౌతేలా వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది.

urvasi rautala ఇన్ సంతోషం అవార్డ్స్ 2022 3
బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ అంటూ సాగుతున్న ఫుల్ మాస్ సాంగ్ లో ఆమె కనిపిస్తోంది. అలాగే రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అయితే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకముందే సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఊర్వశి.

santosham awards 2022 poster

ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26వ తేదీన ఘనంగా జరగనుంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా అనేక రకాల కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు సంతోషం సురేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *