టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ షేక్ హీరోగా నివేత పెత్తురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దాస్ కా ధమ్కీ”.
విశ్వక్ సేన్ మళ్ళీ తన స్వీయ దర్శకత్వం లోనే ప్లాన్ చేసిన ఈ చిత్రం అయితే సౌత్ లో సాలిడ్ రిలీజ్ కి కూడా రెడీ అవుతుంది. ఇక ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మంచి హిట్ కాగా ఇప్పుడు అయితే మేకర్స్ ఆ సాంగ్ యొక్క వీడియొ ని రిలీజ్ చేశారు.
ఇప్పుడు రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్ల అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియొ సాంగ్ అయితే ఇన్స్టంట్ హిట్ ట్రాక్ అని చెప్పొచ్చు. సాంగ్ లో విజువల్స్ కూడా సాంగ్ కి తగ్గట్టుగా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. దీనితో పాటుగా లియోన్ జేమ్స్ ఇచ్చిన ట్యూన్ ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ గా ఉంది. దీనితో ఒక్కసారి విన్న వెంటనే నచ్చేలా అయితే ఈ సాంగ్ ఉందని చెప్పాలి.
డెఫినెట్ గా ఈ దాస్ కా ధమ్కీ నుంచి ఇది మరో హిట్ అని చెప్పాలి. అలాగే విశ్వక్ మ్యూజిక్ టేస్ట్ కూడా మరోసారి బాగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రం అయితే వచ్చే ఫిబ్రవరి 17 తెలుగు సహా తమిళ్ మళయాళం మరియు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది.