విష్ణు మంచు ‘కన్నప్ప’ కి ఓటిటి స్లాట్ దొరికింది!. ఎక్కడ? ఎప్పుడూ ? 

IMG 20250902 WA0333 e1756810076717

డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద డివైన్ బ్లాక్ బస్టర్‌గా ‘కన్నప్ప’ నిలిచింది. థియేటర్లలో దూసుకుపోయిన ఈ ‘కన్నప్ప’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చారిత్రక చిత్రం ఇక సెప్టెంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

‘కన్నప్ప’ చిత్రం విష్ణు మంచు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. తిన్నడు పాత్రలో ఓ గిరిజన యోధుడిగా ఆయన పోషించిన పాత్ర అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.

అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై పద్మశ్రీ డా. మోహన్ బాబు నిర్మించగా.. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అద్భుతంగా తెరకెక్కించారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలిచింది. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అర్పిత్ రాంకా, ప్రీతి ముకుందన్ వంటి తారాగణం కీలక పాత్రల్లో నటించారు.

ఇక ప్రభాస్, అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రలు పోషించడం వల్ల ఈ చిత్రం మరింత ఆకర్షణీయంగా మారింది. వీరి స్పెషల్ అప్పియరెన్స్ సినిమాను అందరి దగ్గరకు తీసుకు వెళ్లింది. కాజల్ అగర్వాల్, మధుబాలా ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.

విష్ణు మంచు కుమారుడు అవ్రామ్ మంచు నటుడిగా అరంగేట్రం చేయడం, అతని కుమార్తెలు అరియానా, వివియానా ఓ పాటలో నటించడంతో మరింత స్పెషల్‌గా మారింది. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందరి హృదయాల్ని తాకింది. ‘శివా శివా శంకరా’ అనే పాట దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది.

‘కన్నప్ప’ చిత్రం తిన్నడు అనే గిరిజన యోధుడి ఆకర్షణీయమైన కథను చూపిస్తుంది. ఇది విశ్వాసం, పరివర్తన, అంతర్గత బలానికి సంబంధించిన కాలాతీత కథగా ప్రతిధ్వనిస్తుంది. ఇక సెప్టెంబర్ 4 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రానుంది. ఈ డివైన్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందరూ చూసి ఆస్వాధించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *