Vishalakshi Movie opens big way in Hyderabad: సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘విశాలాక్షి’ ! 

IMG 20240306 WA0129 e1709725231266

కేతిక హన్మయశ్రీ సమర్పణలో యు.కె. ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ శంకర్‌, మహేష్‌ యడ్లపల్లి, ఆయూషి పటేల్‌, అనుశ్రీ లీడ్‌ రోల్స్‌లో పవన్‌ శంకర్‌ దర్శకత్వంలో పల్లపు ఉదయ్‌ కుమార్‌ నిర్మిస్తు చిత్రం ‘విశాలాక్షి’. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్‌ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి క్లాప్‌ ఇచ్చారు. దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను వీరశంకర్‌, రాజ్‌కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్‌్‌లు సంయుక్తంగా లాంచ్‌ చేశారు.

IMG 20240306 WA0128

అనంతరం దర్శకుడు పవన్‌ శంకర్‌ మాట్లాడుతూ…విచ్చేసి గెస్ట్‌లు అందరికీ కృతజ్ఞతలు. ఇది ఇన్వెస్టిగేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. అలాగే మంచి సస్పెన్స్‌తో నడుస్తుంది. మంచి కథ. మంచి టెక్నికల్‌ టీం అండ్‌ ఆర్టిస్ట్‌లు కుదిరారు. ఇందులో 5 పాటలు, 5 ఫైట్‌లు ఉంటాయి.

మొత్తం 4 షెడ్యూల్స్‌లో సినిమా కంప్లీట్‌ చేస్తాం. టాకీ మొత్తం రాయలసీమ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పాటలను ఊటీ, అరకుల్లో చిత్రీకరించటానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.

IMG 20240306 WA0130

నిర్మాత పల్లపు ఉదయ్‌ కుమార్‌ మాట్లాడుతూ…నా మిత్రుడు, దర్శకుడు పవన్‌ శంకర్‌ చెప్పిన లైన్‌ బాగా నచ్చడంతో దాన్ని ఇద్దరం కలిసి డెవలప్‌ చేశాము. ఇది మా బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.1. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు నిర్మించాలనే కోరిక ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న హీరోలు, హీరోయిన్‌లు ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

ఈ కథ ఇన్వెస్టిగేషన్‌, స్ట్రింగ్‌ ఆపరేషన్‌, ఎమోషనల్‌ వంటి అన్ని అంశాలతో కూడుకున్నది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథను మలిచాము. టైటిల్‌ లోగో చాలా అద్భుతంగా ఇచ్చిన మనోజ్‌ గారికి థ్యాంక్స్‌ అన్నారు.

డీఓపీ: ఉరుకుందరెడ్డి మాట్లాడుతూ…పోస్టర్‌ చూస్తేనే ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ అని అర్ధమౌతుంది. విజువల్‌గా కూడా అద్భుతంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు.

IMG 20240306 WA0131

ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడిన హీరోలు విజయ్‌ శంకర్‌, మహేష్‌ యడ్లపల్లి హీరోయిన్‌లు ఆయూషి పటేల్‌, అనుశ్రీలు తమకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ చిత్రానికి కథ: పవన్‌ శంకర్‌ మరియు పల్లపు ఉదయ్‌ కుమార్‌, కెమెరామెన్‌: ఉరుకుందరెడ్డి ఎస్‌, సంగీత దర్శకుడు: ఆనంద్‌, ఎడిటర్‌: గణేష్‌ దాసరి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: గిరీష్‌ సి.హెచ్‌, పి.ఆర్‌.ఓ: ఆర్‌.కె. చౌదరి, పబ్లిసిటీ డిజైనర్‌: ఎం.కె.ఎస్‌. మనోజ్‌, నిర్మాత: పల్లపు ఉదయ్‌ కుమార్‌, రచన, పాటలు, దర్శకత్వం: పవన్‌ శంకర్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *