Vishal ‘s Rathnam Movie Melody Song launch : విశాల్ ‘రత్నం’ నుంచి మనసుని హత్తుకునే పాట ‘చెబుతావా’ విడుదల !

IMG 20240410 WA0033

మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆధరణను దక్కించుకున్నాయి.

రత్నం చిత్రంలో విశాల్‌కి జోడిగా ప్రియా భవాని శంకర్ నటించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ పెంచారు.

తాజాగా ఈ సినిమా నుంచి మంచి మెలోడియస్, ఎమోషనల్ సాంగ్ ‘చెబుతావా’ను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం, సింధూరి విశాల్ గాత్రాన్ని అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది.

కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *