Vishal Rathnam Movie Trailer Review: మాస్‌ను మెప్పించే విశాల్ ‘రత్నం’ ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోత !

IMG 20240416 WA0151 e1713268978979

మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.

IMG 20240416 WA0152

యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు.

IMG 20240414 WA0214

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆధరణను దక్కించుకున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన రత్నం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రత్నం ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ,తమిళనాడు బార్డర్ గొడవల ఆధారంగా ఈ కథ నడిచేలా ఉంది. ఇక హీరోయిన్ కోసం హీరో చేస్తున్న ఊచకోతను చూస్తుంటే మాస్ యాక్షన్ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్‌కు పండుగలానే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో దేవీ శ్రీ ప్రసాద్ ఆర్ఆర్ అదిరిపోయింది. యాక్షన్, లవ్ సీన్లకు తగ్గట్టుగా మంచి ఆర్ఆర్ ఇచ్చారు.

కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *