Virupaksha Movie Telugu Review: మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా తో తేజు సంయుక్త భయపెట్టి హిట్ కొట్టారా ?

virupaksha telugu రివ్యూ e1682065624166

మూవీ: విరూపాక్ష (VIRUPAKSHA)

విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్ తదితరులు

దర్శకులు : కార్తీక్ దండు

నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్

సంగీత దర్శకులు: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్

ఎడిటర్: నవీన్ నూలి

విరూపాక్ష సినిమా రివ్యూ (VIRUPAKSHAMovie Review):

teju 9

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “విరూపాక్ష”. సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ లో  నటించిన ఈ  మూవీ ‘విరూపాక్ష’. తన కెరీర్‌లో మొదటసారి  ఇలాంటి మిస్టిక్  థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.

ఈ సినిమాకు కార్తీక్ దండు కధ రాసుకొని సుకుమార్ ని కలవడం తో, సుకుమార్ కి కధ నచ్చి కధ కి కధనం తో  పాటు ఓ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ  అంచనాలు పెరిగాయి. వీటితో పాటు టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటం ఈ సినిమాకు  అదనపు ఆకర్షణగా మారాయి.

మరి ఈ రోజు విడుదలైన ‘విరూపాక్ష’సినిమా తో సాయి ధరమ్ తేజ్ అద్భుతమైన  కమ్ బ్యాక్ ఇచ్చాడా లేదా అనే విశయం  మా 18f  మూవీ టీం  రివ్యూలో చదివి తెలుసుకుందామా !

కధ ను పరిశీలిస్తే (story line):

teju 11

రుద్రవనం అనే ఊరిలో చిన్న పిల్లలు వరస పెట్టి సానిపోవడానికి కారణం ఆ ఊరికి కొత్తగా వచ్చిన కుటుంబం చేస్తున్న  క్షుద్రపూజలుకారణం అని బావించిన ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ  కుటుంబ బార్య-బర్తను  సజీవ దహనం చేస్తారు. ఆ ఊరి సర్పంచ్ దాయతలసి వారి  కుమారుడ్ని ఆ ఊరు నుంచి తీసుకువెళ్ళి  వెరే ఊర్లో ని ఆనాధశ్రమం లో జాయిన్ చేస్తాడు .

ఈ సంఘటన జరిగిన పుష్కర కాలం (12 సంవత్సరాలు) తర్వాత సూర్య (సాయి ధరమ్ తేజ్) తన తల్లి స్నేహితుడితో కలిసి రుద్రవనం ఊరు వస్తాడు. రుద్రవనం తన తల్లి పుట్టిన ఊరు కావడంతో.. ఆ ఊరుతో, ఊరి మనుషులతో సూర్యకి ప్రేమ అనుబంధం పెరుగుతాయి. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఊరి సర్పంచ్ (రాజీవ్ కనకాల) కూతురు నందిని (సంయుక్త మీనన్)తో సూర్య, ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను  పొందటం కోసం సూర్య చిన్న చిన్న చిరు  ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో వచ్చిన ఊరి జాతర లో ఊరి ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్న  సమయంలో ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రక్తం కక్కుకొని ఉత్సవాలు జరుగుతున్న అమ్మవారి గర్భగుడిలో చనిపోతాడు. అలా  గర్భగుడిలో ఓక మనిషి మరణం ఏదో కీడుని సంకయిస్తుంది అని  ఈ ఊరి పూజారి (సాయిచంద్ర) .. గుడితో పాటు ఊరిని ఎనిమిది రోజులు పాటు అష్టదిగ్భందనం చేయాలని ఊరి జనాన్ని శాశిస్తాడు .

ఈ ఎనిమిది రోజుల్లో చుట్టిపక్కల ఊర్లు వారు.. ఈ ఊరుకు రావొద్దు. ఇక్కడి వారు ఊరి పొలిమేర దాటొద్దు. ఈ క్రమంలో పొరుగుడు వాడైన సాయి ధరమ్ తేజ్.. ఆ ఊర్లో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ తర్వాత ఊర్లో ఒకరి తర్వాత ఒకరు  అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటారు.

ఇలా జరుగుతున్న మరణాలకు గల కారణాలు ఏమిటి ?

అసలు ఎందుకు మనుషులు చనిపోతున్నారు ?,

మనుషుల అనుమానాస్పద చావుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ?

ఈ చావుల మిస్టరీని సూర్య ఎలా కనిపెట్టి సాల్వ్ చేశాడు ?,

సూర్య నందిని ల ప్రేమ సక్సెస్ అయ్యిందా ?

అసలు ఆ ఊర్లో చేతబడులు జరిగాయా ?

చివరాకరకు ఏం జరిగింది? అనే ప్రశ్నలు మీఋ తెలుసుకోవాలి అనుకొంటే ఈ విరూపాక్ష సినిమా ని డీయేటర్స్ లో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాగలరు.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

teju 13

దర్శకుడు కార్తీక దండు రాసుకొన్న కధ చాలా బాగున్న, ఇలాంటి మిస్టరీకల్ థ్రిల్లర్ సంఘటనల మద్యలో సినిమాలోని ప్రేమ సన్నివేశాలు ఇంకా బెటర్ గా క్రిస్పీగా ఉండి ఉంటే బాగుండేది. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ముఖ్యంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ?, హీరో ఆ చావుల రహస్యాన్ని ఎలా కనిపెడతాడు?, ఆ ఊరుని ఎలా కాపాడతాడు ? అనే ఉత్కంఠ సినిమా చూస్తున్న  ప్రేక్షకుల్లో బాగానే కలిగింది. కాకపోతే.. క్లైమాక్స్ కి ముందు వచ్చేకొన్ని సీన్స్ యొక్క కధనం రాసుకొని ఇంకా బెటర్ గా చూపించి వుండవలసినది. అదే విధంగా హీరోయిన్ పాత్రకు  రాజీవ్ కనకాల పాత్రకు మధ్య ట్రాక్ ను కూడా ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

teju 15

దర్శకుడు కార్తీక్ దండు రాసుకున్న కథ నే ఈ విరూపాక్ష సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. పైగా కార్తీక్ దండు ఈ కథను తెరపై సినీయర్ టెక్నీషియన్స్ సహాయం తో  అద్భుతంగా చూపించాడు. దర్శకుడు ఇంత లాజికల్ గా కల్పిత కధ ను రాసినందుకు హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే. దర్శకుడు కార్తీక్ కథలో ఉన్న సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేసాడు. పైగా హారర్ సీన్స్ ను కూడా చాలా బాగా పిక్చరైజ్ చేసాడు.

అన్నిటికీ మించి ఈ కధని  పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందంటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

virupaksha samyukta 8

ఈ సినిమాలోని విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ ఊహించని టర్న్ తీసుకోవడం, మెయిన్ విలన్ ను ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేయడం బాగుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సూర్య పాత్రలో సాయి ధరమ్ తేజ్  చాలా బాగా నటించాడు.  కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో తనన్యాచురల్  యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండవ అంకం ( సెకెండ్ హాఫ్) లో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా తెజూ అద్భుత నటన తో సినిమాని వెరే లెవెల్ కి తీసుకెళ్ళాడు.

virupaksha samyukta 11

 హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని హారర్ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. కొన్ని సీన్స్ లో  తన కళ్ళతోనే అద్భుత నటన ప్రదర్శించింది.

మరో కీలక పాత్రలలో నటించిన రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ మరియు మిగిలిన సినీయర్ నటీనటులు కూడా తమకు ఇచ్చిన పాత్రల్లో తమదైన నటనతో  మెప్పించారు.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

teju 1 క

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు కార్తీక్ దండు, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ రాసుకోవడంలో మాత్రం కొన్ని చోట్ల తడబడ్డాడు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగ్గ BGMs ఇచ్చి నెక్స్ట్ ఏమి జరుగుతుందో అనే టెన్షన్ ని తన  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా ఇచ్చారు.

 శామ్‌దత్ అందించిన సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అడివిలో రాత్రి జరిగే సంఘటనలను మూన్ లైట్ ఎఫెక్ట్ తో అద్భుతంగా చిత్రీకరించాడు.

virupaksha samyukta 15

 నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతను అభినందించాలి.

నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి. ఓక కొత్త దర్శకుడి కధను నమ్మి అంత భారీగా చిత్రాన్ని నిర్మించినందుకు అభినందించాలి.

18F మూవీస్ టీం ఒపీనియన్:

తెజూ రోడ్డు యాక్సిడెంట్ తర్వాత కొలుకొని నటించిన ఈ ‘విరూపాక్ష’ సినిమా, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ వచ్చి  ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు కార్తీక్ రాసిన కథ, హారర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు.

అయితే, కొన్ని సీన్స్ సినిమాటిక్ గా ఉన్నప్పటికీ కధలో ఊహించని ట్విస్టులు టర్నులతో సాగడం వలన సినిమా చూసే ప్రేక్షకులు ఇలాంటివి పట్టించుకొకపోవచ్చు .

ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా థ్రిల్లర్ చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

virupaksha samyukta 0 1

మా టీం అభిప్రాయం ఏంటంటే విరూపాక్ష కధ, సన్నివేశాలు గురించి ఎవరిని ఆడక్కుండా, ఏమి తెలుసుకోకుండా దియేటర్ కి వెళ్ళి సినిమా చూడండి. మీరు తప్పకుండా థ్రిల్ ఫీ అవుతారు. కధలోని ట్విస్టులు ముందే తెలుసుకుంటే దియేటర్ లో పూర్తికా ఎంజాయ్ చేయలేరు. ఆ సౌండ్ ఎఫెక్ట్ , ఫోటోగ్రాఫిక్ విసుయల్స్ ఓటీటీ, టివి లలో సరిగా ఉండవు. ఎలాంటి సినిమాలను డీయేటర్స్ లో చూస్తేనే ఫీల్ బెటర్ గా ఉంటుంది. కుదిరితే 12 సంవత్సరాల పిల్లలను డీయేటర్స్ కి తీసుకు వెళ్ళడం మానేస్తే బెటర్.

టాగ్ లైన్: ఊహించని ట్విస్టులతో సాగే మిస్టరీ థ్రిల్లర్ !

18f Movies రేటింగ్: 3.5 / 5

* కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *