వినరో భాగ్యం విష్ణు కధ మూవీ తెలుగు రివ్యూ: మంచిని పంచే విష్ణు కధ వినాలి

vbvk review stills e1676789081952

మూవీ: వినరో భాగ్యం విష్ణు కధ 

విడుదల  తేదీ : ఫిబ్రవరి 18, 2023

నటీనటులు: కిరణ్ అబ్బవరం, క‌శ్మీరా ప‌ర్ధేశీ, మురళీ శర్మ, ‘కె.జి.యఫ్’ లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని, శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు

దర్శకుడు : మురళీ కిషోర్ అబ్బూరు

నిర్మాతలు: బన్నీ వాస్

సంగీత దర్శకులు: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: డేనియల్ విశ్వాస్

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

వినరో భాగ్యం విష్ణు కధ  సినిమా రివ్యూ (VBVK Movie Review):

vbvk single promo poster 1

కిరణ్ అబ్బవరం అనే పేరుకి యువకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే కిరణ్ చేసిన రెండవ  సినిమా “ఎస్ఆర్ కల్యాణమండపం”  సినీ ప్రేక్షకులను బాగా మెప్పించింది కాబట్టి. కానీ ఆ కళ్యాణ మండపం తర్వాత వచ్చిన  మూడు సినిమాలతో కిరణ్ ముందుకొచ్చినా, సినీ  ప్రేక్షకులు ఈ సినిమా లను అంతగా ఇస్ట పడలేదు.

దానికి కారణం కిరణ్ నటన కాదు, ప్రేక్షకులు అందరూ కళ్యాణమండపం సినిమా కి మించిన కధ తో కూడిన ఎమోషనల్ డ్రామా ఆశించారు కాబట్టి. కానీ  గత సినిమాల పలితంఎలా ఉన్నా కిరణ్ కి  మాత్రం యువత లో మంచి క్రేజీ ఏర్పడడం తో తెలుగు సినిమా ఇండిస్ట్రీ లో పెద్ద నిర్మాణ సంస్థలు కిరణ్ తో  సినిమాలు నిర్మిస్తున్నాయి.

అలా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన మూవీ వినరోభాగ్యము విష్ణుకథ లో   కిరణ్ అబ్బవరం హీరోగా కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించగా మహా శివరాత్రి పర్వదిన శుభసంధర్భంగా  ఈ చిత్రం నిన్ననే విడుదల అయింది.

మరి శివరాత్రి రోజు థియేటర్శ్ లో కిరణ్ చెప్తున్న  విష్ణు కధ కి  సినీ ప్రేక్షకులను ఏ మేరకు కనెక్ట్ అయ్యారో  మా 18 f మూవీస్ టీం అందించిన  సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందామా !

18 f మూవీస్ టీం ప్రతి సినిమా రివ్యూ ని ఒక రోజు లేట్ అయినా   విశ్లేషణాత్మకంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. మిగిలిన వెబ్ సైటు లతో మాకు సంబంధము  లేకుండా మా 18 f  ప్రేక్షకులకు మంచి సమీక్షా ఇవ్వాలి అనేదే మా ప్రయత్నం.

కధ ను పరిశీలిస్తే (story line):

vbvk review stills 7

తిరుపతి ఏడుకొండల క్రింద నివాసిస్తున్న విష్ణు(కిరణ్ అబ్బవరం) చిన్నతనంలోనే తల్లిదండ్రులను  కోల్పోయి తాత శిక్షణ లో పెరిగి  కొంతైనా తన పక్కవారికి (నయిబార్స్ ) సాయం చేయాలి అనే తత్వం కలిగిన మంచి కుర్రోడు.

దర్శన (కాశ్మీర పరదేశి) తిరుపతి పట్టణం లో నివసించే ఒక యూట్యూబర్. తాను పెద్ద సెలిబ్రిటీ అయిపోవాలి అని ఆలోచిస్తూ  తన ఫోన్ నెంబర్ కి అటు ఇటు ఉన్న నెంబర్స్ కి ఫోన్ చేసి వారితో  “ఏ డే విత్ నైబర్ నెంబర్” అనే కొత్త కాన్సెప్ట్ తో  వీడియో చేసి అప్లోడ్ చేయాలి అనే ఆలోచనతో  ఫోన్ చేస్తే అటు నంబర్ లో  విష్ణు కనెక్ట్ అయితే  ఇటు నెంబర్ లో  శర్మ (మురళి శర్మ) తగులుతారు.

వీళ్ల ముగ్గురి మధ్యన జరిగే కథ కొంచెం కామిడీ తో కూడిన లవ్ ట్రాక్ గా సాగుతుంది. ఇదే విష్ణు చెప్పే కధ. ఇదే మొత్తం సినిమా కధ కాదు. మరో ఎపిసోడ్ లో NIA టీం పాకిస్తాన్ నుండి హైదరాబాద్ కి ఫోన్ కాల్ వచ్చింది అని ఆ కాల్ ద్వారా  ఉగ్రవాదులు ఏదో పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారు అనే కోణం లో ఇన్వెస్టిగేసన్ చేస్తుంటారు.  ఈ NIA టీం ఫ్లాట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది.

vbvk first single 1

ఇలా కామిడీ, ఫ్యామిలీ, భక్తి, సమాజాసేవ, ఉగ్రవాదం తో అన్నీ  జోనర్లు మిక్స్ చేసి రెండు గంటల సినిమా కధ లో చెప్పే ప్రయత్నం చేశాడు  దర్శకుడు. అన్నీ జోనర్స్ మిక్స్ కావడం వలన  కాస్తంత గందరగోళం స్క్రీన్ ప్లేతో సాగదీసిన ఫ్యామిలీ థ్రిల్లింగ్ వినోద కథాచిత్రమే  ఈ “వినరో భాగ్యము విష్ణు కధ ” సినిమా కధ.

ఇలా సాగిపోతున్నవిష్ణు కధ లో  కొన్ని సంఘటనల అనంతరం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతను బాగా వంట పట్టించుకున్న హీరో తన చుట్టుపక్కల వారికి, పరిచయం అవుతున్న వారికి సాయం చేయడం అలవాటు చేసుకుంటాడు.

ఇలాంటి లక్షణాలు ఉన్న యువకుడు  విష్ణు,  నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో సినిమా కధ ను  మొదలు పెట్టి ముగించే ప్రయత్నం చేస్తాడు.

ఈ కధ గమనంలో  జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో కొన్ని ఆశక్తికార విశయాలు వెలుగుచూస్తాయి. వాటిని ప్రశ్నల రూపం లో విశ్లేషిస్తే ….

దర్శన ఎందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది?,

అసలు శర్మ గారు  ఎవరు? మంచి వాడా చేడ్డవాడా? ,

విష్ణు తల్లి తండ్రులు చిన్నప్పుడు ఎలా చనిపోయారు ?

ఎన్ ఐ ఏ ఏమి సాదించింది ? అసలు ఉగ్రవాదులు  ఉన్నారా ?

విష్ణు దర్శిన లవ్ ట్రాక్ ఎలా సాగింది? అసలు ఇద్దరిమద్య ప్రేమ ఉందా ?

విష్ణు కథ తో  విష్ణు ఏం సాదించాడు  ? అనే ప్రశ్నలకు జవాబులు కావాలి అంటే మీరు విష్ణు కధ వినుటకు సినిమా థియేటర్ కి వెల్లవాలసిందే. పిల్లలు పెద్దలు అందరూ చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలుస్తుంది. ఎందుకంటే ఒక్క సిగరెట్టు సీన్ కానీ, మందు గ్లాస్ కెఎన్ గాని లేకుండా తీసిన సినిమా ఇది

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (screen – Play):

vbvk teaser promo

దర్శకుడు మురళీ కిషోర్ మొదటి సినిమా తోనే  సమాజ సేవకి, మనుషుల ఎమోషన్స్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కధనాన్ని  (స్క్రీన్ ప్లే ) రాసుకోలేదా అనిపిస్తుంది.

హీరో- హీరోయిన్ మధ్య సాగే కామిడీ సీన్స్ బాగున్నాలవ్ ట్రాక్  బాగా స్లోగా సాగుతుంది. అలాగే వారి ప్రేమకు బలమైన పాయింట్ కూడా లేదు. అసలు హీరోయిన్ దర్శిన క్యారెక్టర్ చాలా సిల్లీగా ఉంటే.. మురళీ శర్మ ట్రాక్ మరీ సినిమాటిక్ గా మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్ ) లో  కామిడీ గా  సాగింది.

హీరో పాత్ర కూడా తనకు అన్యాయం జరిగినా పక్కవారికి, ఆపదలో ఉన్నవారికి  సాయం చేయడానికే ఉందా  అన్నట్టు ప్రతి సీన్ లో  సాగుతుంది.  ప్రీ ఇంటర్వెల్ దాకా విష్ణు కధ లో సాయం అనే అంశం తప్ప, మరో కోణం లో  దర్శకుడు కధనాన్ని  మలచలేక పోయాడు . పైగా సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ అంశాలుతో ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది అనిపించింది.

మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్ ) లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప  మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.

ఇక రెండవ అంకం (సెకండాఫ్) ని కాస్త హ్యూమన్  ఎమోషన్ టచ్ తో  గ్రిప్పింగ్ గా  నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ ఆయినట్టు అనిపించదు. పైగా హార్టిఫీషియల్  ఎమోషన్స్ చుట్టూ పేలవమైన కధనం తో సినిమాని సాగదీసి ముగించారా అనిపిస్తుస్తుంది.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

vbvk review stills 8

దర్శకుడు: తిరుపతి నేపద్యం లో సాగిన  వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన మురళీ కిషోర్ అబ్బూరి  కొన్ని కామెడీ అండ్ లవ్ సీన్స్ కి  థ్రిల్లింగ్ అంశాలు మిక్స్ చేసి  కధ చెప్పే  ప్రయత్నం చేశాడు. పేపర్ మీద రాసుకొన్నప్పుడు ఈ  నెంబర్ నైబర పాయింట్ కొత్తగా ఉన్నా స్క్రీన్ మీదకు వచ్చేటప్పటికి గందరగోళంగా మారింది.

దర్శకుడు నందు ది (మురళి కిషోర్ అబ్బూరి ) మంచి ప్రయత్నమే కానీ చిన్న చిన్న లోపాలు కధనం లో సారి చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. ఇప్పటికీ ఈ విష్ణు కధ  తీసిపారేసే సినిమా కాదు. సిని లవర్స్ చూడవలసిన సినిమానే.

హీరో: కిరణ్ అబ్బవరం చేసిన  విష్ణు పాత్ర లో తాను  మాస్ హీరో గా కనిపించడం కోసం బాగానే కస్టపడ్డాడు. నటుడిగా  తన ఈజ్ యాక్టింగ్ తో కూల్  పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. విష్ణు పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఉన్న మంచి అబ్బాయి గా  బాగానే నటించాడు.

విష్ణు పాత్రకి సంబంధించిన ట్రాక్, ఆ పాత్ర చుట్టూ తిరిగే  మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు నేపద్యం .. ఇలా మొత్తానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కిరణ్ కి మంచి సినిమా నిలిస్తుంది. తన కెరియర్ హైయిస్ట్ గ్రాసర్ గా నిలవ్యవచ్చు ఈ విష్ణు కధ.

హీరోయిన్:  ఇక హీరోయిన్ గా నటించిన క‌శ్మీరా ప‌ర్ధేశీ తన బుబ్లీ లుక్స్ తో అమాయక అమ్మాయిగా ఆకట్టుకుంది. ఈ విష్ణు కధ లో దర్శినిగా  నటించడానికి ఆమె బాగానే కాస్తపాడింది.

మూడో కీలక పాత్రలో మురళీ శర్మ చాలా బాగా నటించాడు. హీరోయిన్ తో రీల్స్ వీడియొలు చేసేటప్పుడు చేసిన ఫోర్ఫోర్మెన్స్ కి థియేటర్ లోని ఆడియన్స్ నుండి అద్బుతమైన రేస్పన్స్ వస్తుంది.  ఇంకా  ‘కె.జి.యఫ్’ లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని తమ పాత్రల పరిది మేరకు బాగా నటించారు.

విష్ణు కధ సినిమా కి  చైతన్ భరద్వాజ్ అందించిన నేపద్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

vbvk review stills 1

సంగీత దర్శకుడు:  చైతన్ భరద్వాజ్ అందించిన పాటలలో  రెండు పాటలు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆ ఆ సన్నివేశాలను ఆకట్టుకొనే విదంగా చేసింది.

ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ గారి ఎడిటింగ్ ఈ సినిమా కి  జస్ట్ ఓకే అనిపిస్తుంది. కధనం లో వచ్చే  కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో నిడివి తగ్గించి ఉంటే సాగదిత కంట్రోల్ అయ్యేది.

ఈ సినిమా కి సినిమాటోగ్రఫీ బాగుంది. తిరుపతి కొండలను విష్ణు చక్రాలను సీన్ లో బాగంగా చక్కగా చూపించారు.  సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు.

ప్రొడ్యూసర్: విష్ణు కధ సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. గీతా ఆర్ట్స్ నుండి వచ్చిన సినిమా  కాబట్టి ఎక్కడ రాజీ పడకుండా చక్కగా నిర్మించారు.

18F మూవీస్ టీం ఒపీనియన్:

vbvk review stills 5

నెంబర్ నైబర్ పాయింట్ తో  కామిడీ, లవ్, సమాజ సేవ, హ్యూమన్ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘వినరో భాగ్యము విష్ణు కథ’  అటు లవ్ అండ్ ఫన్ డ్రామాలా సాగుతూనే.. ఇటు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ టైపులో సాగుతూ విష్ణు కధకు కొనసాగింపు ఉంది అనే టైటిల్ లో ముగించారు.

ఆసక్తి కర అంశాలు తో పాటు సాగతీత సన్నివేశాలు, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి సీన్స్ సినిమా కధ కి కొద్దిగా మైనస్ అయ్యాయి.

ప్రేమ జంటలకు  ఫ్యామిలీ ఆడియన్స్ కి మరియు పిల్లలకు  ఈ సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు నచ్చుతాయి. ఓవరాల్ గా  రెండు గంటలు థియేటర్ లో కూర్చుని సినిమా చూద్దాము అనుకోనే వారికి  శ్రావ్య – దృశ్య భాగ్యం కలిగిస్తుంది ఈ విష్ణు కధ.

టాగ్ లైన్: పిల్లలు పెద్దలు ఈ విష్ణు కధ వినవచ్చు.

18f Movies రేటింగ్: 2.75/ 5

* కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *