Villains Anthem from Rakshasa Kavyam Out: “రాక్షస కావ్యం” సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, రామ్ మిర్యాల పాడిన విలన్స్ ఆంథెమ్ రిలీజ్!

Villians Anthem e1693234166479

నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Villains anthem song for Rakshasa kavyam

ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి విలన్స్ ఆంథెమ్ ను రిలీజ్ చేశారు.

Villains anthem song cover e1693234212840

కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ ప్రమోషనల్ సాంగ్ కు ఆర్.ఆర్ ద్రువన్ ట్యూన్ కంపోజ్ చేశారు. ముగ్గురు టాప్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, రామ్ మిర్యాల, మంగ్లీ ఈ పాటను పాడారు.

Villains anthem song for Rakshasa kavyam 4

డీలో డిల్లెలో డీలో డిల్లెలో హీరో ఎవడు విలన్ ఎవడు జిందగీలో…డీలో డిల్లెలో డీలో డిల్లెలో..సెడ్డోడెవడు మంచోడెవడు బోలో బోలో…అంటూ మనుషుల వ్యక్తిత్వాలను ప్రశ్నిస్తూ అర్థవంతమైన లిరిక్స్ తో సాగుతుందీ పాట. విలన్స్ గురించి ప్రత్యేకంగా ఈ పాటను డిజైన్ చేయడం విశేషం.

Villains anthem song for Rakshasa kavyam 2

మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

నటీనటులు:

నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు

Villains anthem song for Rakshasa kavyam 6

టెక్నికల్ టీమ్: 

ఎడిటర్ అండ్ కలరిస్ట్ – వెంకటేష్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ – రుషి కోనాపురం
సంగీతం – రాజీవ్ రాజ్, శ్రీకాంత్,ఆర్.ఆర్ దృవన్
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
సాహిత్యం – కాసర్ల శ్యామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉమేష్ చిక్కు
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి
కో ప్రొడ్యూసర్స్, నవీన్ రెడ్డి, వసుంధర దేవి
పీఆర్వో – జి.ఎస్.కె మీడియా
నిర్మాతలు – దాము రెడ్డి, శింగనమల కల్యాణ్
రచన, దర్శకత్వం – శ్రీమాన్ కీర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *