Vikram – PaRanjith Thangalaan Release date locked: చియాన్ విక్రమ్, పా రంజిత్ పీరియాడిక్ యాక్షన్ సినిమా “తంగలాన్” విడుదల ఎప్పుడంటే! 

IMG 20231027 WA0120 e1698412003132

 

చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా “తంగలాన్“. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

“తంగలాన్” సినిమాను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

“తంగలాన్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చియాన్ విక్రమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన “తంగలాన్” సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.

 

నటీనటులు:

చియాన్ విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

టెక్నికల్ టీమ్ :

సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్, ఆర్ట్ – ఎస్ ఎస్ మూర్తి, ఎడిటింగ్ – ఆర్కే సెల్వ, స్టంట్స్ – స్టన్నర్ సామ్, బ్యానర్స్ – స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం – పా రంజిత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *