Vijay’s Family Star Movie OTT Streaming date locked: అమోజాన్ ప్రైమ్ వీడియోలో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” స్ట్రీమింగ్ !

Vijay Family Star Movie OTT Streaming date locked e1714026860686

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఫ్యామిలీ స్టార్” డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. రేపటి నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ అర్థరాత్రి నుంచే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఈ నెల 5వ తేదీన రిలీజైన “ఫ్యామిలీ స్టార్” సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, పరశురామ్ పెట్ల చూపించిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *