విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్,  “వీడీ 14” సెట్ వర్క్ ప్రారంభం

IMG 20250126 WA0281 e1737892559799

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “వీడీ 14”. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

“వీడీ 14” సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా సెట్ వర్క్ ప్రారంభించారు. ఈ సందర్భంగా

IMG 20250126 WA0283

దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా “వీడీ 14” సెట్ వర్క్ ప్రారంభించాం. బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో “వీడీ 14” ఒక పవర్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. అన్నారు.

19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందుతోంది.

‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ‘

టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

నటీనటులు :

విజయ్ దేవరకొండ, తదితరులు

టెక్నికల్ టీమ్:

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్),బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్,నిర్మాతలు – నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రచన, దర్శకత్వం – రాహుల్ సంకృత్యన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *