ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై ఎక్కిన దేవరకొండ !

IMG 20250515 WA0061 e1747289514205

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ను హాలీవుడ్ మేగజైన్స్ సైతం క్యాప్చర్ చేస్తున్నాయి. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ విజయ్ దేవరకొండను తన కవర్ పేజీగా పబ్లిష్ చేసింది. ‘విజయ్ దేవరకొండ ది మ్యాన్ ఆన్ ఎ మిషన్’ అనే టైటిల్ తో వచ్చిన ఈ మేగజైన్ ఆకట్టుకుంటోంది.

‘ఆత్మవిశ్వాసం, ఆకర్షణ ఉట్టిపడే విజయ్ దేవరకొండను మేము క్యాప్షన్ చేశాం. తన కొత్త సినిమా కింగ్డమ్ తో విజయ్ ఒక లక్ష్యంతో సాగుతున్నారు..’ అంటూ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది.

IMG 20250515 WA0067

తన కొత్త సినిమా “కింగ్డమ్”తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

  టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. “కింగ్డమ్” సినిమా జూలై 4వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *