విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” పాటలు ఎలా ఉన్నాయంటే !

IMG 20241115 WA0170 e1731675163199

వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకొచ్చారు.

“సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించారు. విజయ్ కు జోడీగా రాధిక మదన్ కనిపించారు. ఈ జంట స్క్రీన్ ప్రెజెన్స్ “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రోజు మేకర్స్ ఈ సాంగ్ ను విడుదల చేశారు.

IMG 20241115 WA0186

“సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. తన సరికొత్త సంగీత శైలి, భావోద్వేగాలతో “సాహిబా” పాటను శ్రోతల ముందుకు తీసుకొచ్చారు జస్లీన్ రాయల్.

వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ పాట చిరకాలం మ్యూజిక్ లవర్స్ మనసుల్లో నిలిచిపోయేలా రూపొందించారు. ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ గా కనిపించారు. ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా “సాహిబా” మ్యూజిక్ వీడియో సంగీత ప్రపంచంలో ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *