Vijay Antony new Movie Love Guru: విజయ్ ఆంటోనీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ గురు” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

love guru e1692269801202

బిచ్చగాడు సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేశారు కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆయన నటించిన బిచ్చగాడు 2 సినిమా ఇటీవలే రిలీజై తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. విజయ్ ఆంటోనీ తొలిసారి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రోమియో తెలుగులో లవ్ గురు పేరుతో తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో మృణాళినీ రవి హీరోయిన్ గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.

love guru poster look

లవ్ గురు సినిమాను తన బ్యానర్ గుడ్ డెవిల్ లో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా ద్వారా లవ్ గురు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు హీరో విజయ్ ఆంటోనీ. ఆయనను రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో చూడాలనుకునే అభిమానుల కోరికను ఈ సినిమా తీర్చనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి జోడీ ఓ మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీని చూపించబోతున్న ఫీల్ ను కలిగిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి విడుదలకు ప్లాన్ చేసుకుంటోంది.

నటీనటులు :

విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ – ఫరూక్ జే బాష

సంగీతం -భరత్ ధనశేఖర్

ఎడిటింగ్, నిర్మాత – విజయ్ ఆంటోనీ

బ్యానర్ – గుడ్ డెవిల్

పీఆర్వో – GSK మీడియా

రచన దర్శకత్వం – వినాయక్ వైద్యనాథన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *