చేతన్‌ చీను, బన్నీవోక్స్‌ నటించిన ‘విద్యార్థి’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే !

vidyarthi movie poster launch 4 e1682162412984

చేతన్‌ చీను, బన్నీవోక్స్‌ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆళ్ల వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత డి.ఎస్‌.రావు ఆధ్వర్యంలో ఈ నెల 29న సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో.. 

vidyarthi movie poster launch 5

డి.ఎస్‌.రావు మాట్లాడుతూ ‘‘చేతన్‌ చీనుచ చెప్పగా నేనీ సినిమా చూశారు. ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. దర్శకుడికిది తొలి చిత్రం అయినా చాలా లావిష్‌గా రూపొందించారు. చేతన్‌కు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్‌ ఒకటే లేదు కానీ హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌ అతనిలో ఉన్నాయి. మంచి స్టార్‌ అవుతాడు. ఈ సినిమా మీద నమ్మకంతో విడుదల చేయడానికి ముందుకొచ్చా’’ అని అన్నారు.

vidyarthi movie poster launch

దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ: ‘‘దర్శకుడిగా తొలి చిత్రమిది. చాలాకష్టపడి తీశాం. ఎక్కడా బ్రేక్‌ లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. కాకపోతే కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. డి.ఎస్‌.రావు సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.

vidyarthi movie poster launch

చేతను చీను మాట్లాడుతూ: ‘‘రాజుగారి గది’ పెద్ద హిట్‌ తర్వాత డిఎస్‌.రావుగారు ఓ మంచి రొమాంటిక్‌ కామెడీ చిత్రంతో హీరోగా లాంచ్‌ చేశారు. అది కూడా మంచి హిట్‌ అయింది. రాజుగారి గది చిత్రం నుంచి దర్శకుడు మధుతో పరిచయం ఉంది. ఆయనతో ఓ సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు. ఓ రోజు రాత్రి 12 తర్వాత ఫోన్‌ చేసి ఓ లైన్‌ అనుకున్నా చేస్తారా అనడిగారు. నాకు ఆయన ప్యాషన్‌ ఏంటో తెలుసు. కథ, నిర్మాతలు ఎవరు అన్నది ఏమీ అడగకుండానే ఓకే చెప్పేశా.

vidyarthi movie poster launch 2 e1682162483565

మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేశారు. కాకపోతే కరోనా వల్ల రిలీజ్‌ ఆగింది. సినిమా విడుదలకు మా నిర్మాతలు పడుతున్న కష్టం చూసి డి.ఎస్‌.రావు గారికి మా సినిమా చూపించాను. ఆయనకు నచ్చి నేనే రిలీజ్‌ చేస్తానన్నారు. ఈ చిత్రం మా అందరి తలరాతను మారుస్తుందనే నమ్మకం ఉంది.

ప్రతి ప్రాంతంలోనూ జరిగే ఓ అంశాన్ని తీసుకుని దర్శకుడు కథ రాశారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.

‘‘త్వరలో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించి ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు.

నటీనటులు

చేతన్‌ చీను,
బన్నీవోక్స్‌
రఘుబాబు,
జీవా,
టిఎన్‌ఆర్‌,
జ్వాలా కోటి,
దిశాంత్‌,
నవీన్‌నేని,
శరన్ అడ్డాల
జబర్దస్త్ అప్పారావు
పవన్ సురేష్
యాదమరాజు,
మణిచందన, తదితరులు

సాంకేతిక నిపుణులు
కెమెరా: కన్న.పి.సి,
సంగీతం: అజయ్‌ బుల్గానియన్‌,
ఎడిటర్‌: బి.నాగేశ్వరరెడ్డి,
స్టంట్స్‌: రామకృష్ణ,
కొరియోగ్రఫీ: అనీశ్‌,
కో-ప్రొడ్యూసర్‌: రామకృష్ణ రాజేటి,
లైన్‌ ప్రొడ్యూసర్‌: వంశీ తాడికొండ,
ప్రొడక్షన్‌ డిజైనర్‌: శరణ్‌ అడ్డాల,
పి.ఆర్‌.ఓ: మధు.విఆర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *