VIDUDALA Part-1 TELUGU REVIEW: సహజత్వం తో తీసిన ఓ పోలీసోడి కధ

vidudala review e1681560359810

మూవీ: విడుదల పార్ట్ – 1 (Vidudala Part -1)

విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2023

నటీనటులు: సూరి, భవాని శ్రీ, విజయ్ సేతుపతి, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, తమిళ్ మరియు ఇతరులు

దర్శకులు : వెట్రిమారన్

నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్

సంగీత దర్శకులు: ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్రాజ్

ఎడిటర్: ఆర్ రామర్

vidudala pic 9

విడుదల పార్ట్-1 సినిమా రివ్యూ (VIDUDALA P-1 Movie Review):

తన సినిమా లతో ఐదు సార్లు జాతీయ అవార్డు అందుకొన్న దర్శకుడు వెట్రిమారన్, అశురన్ (నారప్ప -తెలుగు లో ) తర్వాత కిన్న సినిమా చేద్దాము అని, ఇప్పటి వరకూ చిన్న చిన్న కామిడీ పాత్రలు చేస్తున్న పరోటా సూరి ని మెయిన్ లీడ్ లో పెట్టి తమిళం లో  తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడిదలై కి తెలుగు వెర్షన్ నే   విడుదల పార్ట్ – 1.

vidudala review 2

తమిళనాడు లో మక్కల్ సెల్వన్ అని పిలుచుకొనే విజయ్ సేతుపతి కీలక పాత్ర లో నటింపచేసి మెయిన్ కధ కు తనదైన స్క్రీన్ ప్లే తో ఒవెరల్ గా 5 నుండి 6 గంటలు సినిమా తీసి, ఎడిటింగ్ లో చూసుకొన్న తర్వాత, అన్నీ సీన్స్ బాగున్నాయి అని ఇప్పుడు ఈ విడుదలై ని రెండు పార్టులుగా చేసి మొదటి పార్ట్ ని క్రీత వారం తమిలనాడులో విడుదల చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది.

vidudala pic 2 Copy

ఆ స్పందనని తెలుగులో గూడా పొందవచ్చు అని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్  తమ గీతా ఫిల్మ్ ద్వారా డిస్ట్బూట్ ద్వారా ఈ రోజు తెలుగులో విడుదల చేశారు. తమిళ్ లో సూపర్ హిట్ అవ్వడం వలన తెలుగు లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకొన్నది అనేది మా 18f మూవీ టీం  సమీక్ష లో చదివి తెలుసుకొందాము.

vidudala pic 12

కధ ను పరిశీలిస్తే (story line):

విడుదల సినిమా కధ లోకి వెళ్తే… తమిళనాడు- కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు కొండలతో చుట్టుముట్టబడిన ఒక సున్నితమైన గ్రామంలో ప్రభుత్వం ప్రెవేట్ కాంపీనిలకు మైనింగ్ చేసుకొనే అవకాశం ఇస్తుంది. ఆ ప్రాంతం లో మైనింగ్ చెయ్యాలి అంటే రోడ్డు లు ఉండాలి అని గవర్నమెంట్ రోడ్డులు వేయడానికి సంకల్పిస్తుంది.

ఆ గ్రామ చుట్టి పక్కల మైనింగ్ వలన తమ జీవన విదానం మారిపోతుంది అని  ప్రజా పోరాట నాయకులు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తూ ఉంటారు. వారిని అణిచివేయాలి అని పోలీస్ వారు ఆ అడవి ప్రాంతములో కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజా పోరాటం లో పాల్గొనే ముక్య నాయకుడి కోసం గాలిస్తూ ఉంటారు.

vidudala pic 01 Copy

అలాంటి ప్రాంతానికి  కుమరేసన్ (సూరి) పోలీసు అధికారిగా నియమితుడవుతాడు. అక్కడ వున్న అధికారి కుమారేశం కి శిబిరంలో డ్రైవర్‌ పని అప్పజెప్పుతాడు. కాగా కొన్ని అనుకోని సంగటనాలతో  అక్కడి  ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకోవడానికి ఆపరేషన్ ఘోస్ట్ హంట్ అనే మిషన్‌ కు కుమరేసన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు.

దురదృష్టవశాత్తు, పెరుమాళ్ యొక్క ఆచూకీ గురించి పోలీసు అధికారులు ఎవ్వరికీ తెలియదు, కానీ నిజాయితీగల పోలీస్ డ్రైవర్ అయిన కుమరేశన్ గ్రామ ప్రజల కష్ట కాలం లో తనకు తోసిన సహాయం చేస్తూ ఉంటాడు. అలా గ్రామ ప్రజలతో తిరుగుతూ ఉండడటం వలన పెరుమాళ్ మరియు అతని అనూచారుల స్థావరాన్ని కనుగొంటాడు.

vidudala pic 4 Copy e1681560497590

మరి ఆ తరువాత కుమరేశన్ ఏమి చేశాడు ?

 డ్రైవర్‌ చెప్పిన మాటను పోలీసులు నమ్మారా?

ఈ కథకు పాప అకా తమిళరసి (భవాని శ్రీ) కి ఉన్న సంబంధం ఏంటి?

పోలీసులు కుమరేశన్ సహాయం తో  పెరుమాళ్‌ని పట్టుకున్నారా లేదా?

అసలు పెరుమాళ్ ఎవరు ? అతని కధ ఏంటి ?

ఎందుకు ప్రజా దళం నాయకుడు అయ్యాడు ?

గ్రామ ప్రజల మంచికోరే కుమారేశన్ ఎందుకు పెరుమాళ్ ని పట్టుకొంటాడు ?

అనే వాటన్నింటికీ సమాధానాలు కావాలంటే విడుదల పార్ట్ 1 మూవీ దియేటర్స్ లో మాత్రమే చూడాలి.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

vidudala pic 13

మనం చూస్తున్న ఈ విడుదల సినిమా స్టోరీ ఎంతో పాతదే కానీ దానిని మరింత ఎంగేజింగ్ గా ఆడియన్స్ ని అలరించేలా దర్శకడు వెట్రిమారన్ స్క్రీన్ ప్లే  రాసుకొన్న విదానం బాగుంది. కానీ మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో కధ లొని ప్రదేశాన్ని, పాత్రలను పరిచయం చేసే విదానం బాగుంది.

కానీ రెండవ అంకం (సెకండ్ హాఫ్) మాత్రం ఎంతో స్లో గా సాగుతుంది. కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ, మరో పార్ట్ కోసం కొంత స్కరరెన్ ప్లే దాచుకోవడం కోసం   సాగతీయడం వలన ఆడియన్స్ కి కొన్ని సీన్స్ కనెక్ట్ కావు. రెండవ అంకం ( సెకండ్ హాఫ్) లో వచ్చే అర్ధనగ్న సన్నివేశాలు, వయొలెన్స్ వంటివి కామన్ ఆడియన్స్ కి కొంత ఇబ్బంది ని కలిగిస్తాయి.

మరో పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఇందులోని చాలా మంది ముఖ్య పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు వారికి పెద్దగా తెలియకపోవడం. అలానే కొన్ని సన్నివేశాలు తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండడంతో అవి మన తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ కావు. కధ సహజత్వం తో కుడికొన్నదే అయినా, ఒకే పార్ట్ గా విడుదల చేసి ఉంటే కధనం లో స్పీడ్ పెరిగి ప్రేక్షకులకు మంచి సినీమా చూస్తున్న అనుభూతి కలిగేది.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

vidudala pic 11

దర్శకుడు వెట్రిమారన్ తీసే సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు, ఆయన తీసుకున్న కథ, కథనాలని సహజత్వంతో పాటు పెద్ద నటులతో  గొప్పగా తెరకెక్కించగల దిట్ట. సాధారణ ప్రజలతో పోలీసులు ఏవిధంగా వ్యవహరిస్తారు అనేటువంటి అంశాలను విడుదల పార్ట్ 1 లో బాగా చూపించారు వెట్రిమారన్.

నిజానికి విడుదల పార్ట్ 1 లో కథ అందరికీ తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియడ్ డ్రామా ని తన అలరించే స్టైల్ కథనంతో బాగా తెరకెక్కించారు దర్శకుడు.

తమిళ కినిమాల్లో  కమెడియన్ అయిన సూరిని ఇంతటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్రిమారన్ చేసిన పెద్ద సాహసం అనే అనాలి. అలానే సూరి కూడా తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు.

vidudala pic 3 Copy

మరో ముఖ్య పాత్ర లో  విజయ్ సేతుపతి నటించిన తీరు కూడా చాలా బాగుంది. పార్ట్ -1 లో  స్క్రీన్ టైం తక్కువే అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్ గా ఆయన పెర్ఫార్మ్ చేసారు. అయితే సెకండ్ పార్ట్ లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది.

లేడి లీడ్  తమిళరసి పాత్రలో కనిపంచిన  భవాని శ్రీ  యాక్టింగ్ ఎంతో బాగుంది. అలానే సూరికి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. సహజత్వం కోసం తను చాలా కష్ట పడి నటించింది.

గౌతమ్ మీనన్ కూడా ఓక ముఖ్య పాత్రలో అద్బుతంగా నటించాడు. మరో నటుడు  చేతన్ తో పాటు ఇతర పాత్రధారులు అందరూ బాగా నటించారు. డబ్బింగ్ తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాల సింగిల్ షాట్ ట్రైన్ ఆక్సిడెంట్ సీన్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంకా ఇంటెన్స్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ గ్లింప్స్ వంటివి బాగున్నాయి.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

vidudala pic 12

సహజత్వానికి దగ్గరగా ఉన్న ఇటువంటి కథని తీసుకుని ఆడియన్స్ ని అలరించేలా ప్రయత్నించి తెరక్కించిన తీరుకి దర్శకుడు వెట్రిమారన్ ని అభినందించాలి. చాలా వరకు సీన్స్ ని ఎంతో సహజంగా అద్భుతంగా ఆయన తెరకెక్కించారు అనే చెప్పాలి.

ఆర్ వేల్రాజ్ ఫోటోగ్రఫి ఎంతో బాగుంది. కొన్ని వైడ్ యాంగిల్ షాట్స్ అయితే మరింత బాగున్నాయి. కొండలు, గుట్టలు చాలా న్యాచురల్ గా చిత్రీకరించాడు అని చెప్పవచ్చు.

ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే మాస్త్రో ఇళయ రాజా గురించి చెప్పుకోవాలి.  సినిమాలో రెండు పాటల తో పాటు పలు సన్నివేశాల్లో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుంది.

విడుదల సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది.

18F మూవీస్ టీం ఒపీనియన్:

vidudala pic 5 Copy

మొత్తంగా విడుదల పార్ట్ 1 సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండే రియలిస్టిక్ పోలీసు కథ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ, సూరి, సేతుపతి యాక్టింగ్, క్లైమాక్స్ వంటివి ఈ సినిమా కి  ప్రధాన బలాలు.

vidudala pic 1 Copy

సహజత్వం కోసం వదిలేసిన కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నప్పటికీ మొత్తంగా ఈ మూవీని న్యాచురల్ కధలు ఇష్ట పడే ప్రేక్షకులు ఈ వీకెండ్ లో థియేటర్ కి వెళ్ళి  చూసేయొచ్చు.

టాగ్ లైన్: సహజత్వం నిండిన పోలీస్ డ్రామా !

18f Movies రేటింగ్: 3.5 / 5

* కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *