“విడుదల 2” చిత్రాన్ని దక్కించుకున్న శ్రీ వేధక్షర మూవీస్ అధినేత !        

IMG 20241104 WA0088 e1730743538307

తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం విడుదల. విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అదేవిధంగా అతి త్వరలో “విడుదల2” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా, ఫాన్సీ రేట్ తో ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు.

IMG 20241104 WA0093

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ“విడుదల 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫో టైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తో కలిసి ఈ చిత్రాన్ని అత్య ద్భుతంగా తెరకెక్కించారు.

IMG 20241104 WA0059

మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రాన్ని మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతూ, ఈ చిత్రం డెఫినెట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం అని అన్నారు

  విజయ సేతుపతి, సూరి, మంజుల వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవాని శ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: వేల్ రాజ్, సంగీతం: ఇళయరాజా, దర్శకత్వం: వెట్రీ మారన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *