Vidhi Movie streaming in Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లోకి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం ‘విధి’

IMG 20240127 WA0023 e1706329594902

  డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అలా వచ్చిన ఓ చిత్రమే విధి. గత ఏడాది వచ్చిన ఈ విధి సినిమా ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ ఈ మూవీని నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ కేవలం ఈ సినిమాకు రచన చేయడం మాత్రమే కాకుండా కెమెరామెన్ బాధ్యతను కూడా స్వీకరించాడు. దర్శకుడిగా శ్రీకాంత్ వ్యవహరించాడు.

రోహిత్ నందా, ఆనంది జంటగా నటించిన ఈ విధి చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ అమెజాన్‌లో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది. విధి చిత్రంలో పెన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందన్న సంగతి తెలిసిందే.

ఆ పెన్‌తో ఎవరు రాసినా కూడా చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? పెన్ నేపథ్యం ఏంటి? పెన్ చేతికి వచ్చిన హీరో ఏం చేశాడు? అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్‌లతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.

 

ఎన్నో యూత్‌ఫుల్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల.. విధికి మంచి సంగీతాన్ని అందించారు. ఆయన ఆర్ఆర్ సినిమాకు మేజర్ అస్సెట్‌గా నిలిచింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *