మూవీ: రణస్థలి
విడుదల తేదీ : 26-11- 2022
నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని, సమ్మెట గాంధీ, ప్రశాంత్, శివ జామి, నాగేంద్ర , విజయ్ రాగం తదితరులు
దర్శకుడు : పరశురామ్ శ్రీనివాస్
నిర్మాత: అనుపమ సురెడ్డి
సంగీత దర్శకులు:కేశవ్ కిరణ్
సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ
నిర్మాణ సంస్థ: ఏ.జె ప్రొడక్షన్
ఒకప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు ఉంటే చాలు.. ఆ సినిమాను ఆదరించేవారు. కాని ఇప్పుడు హీరో హీరోయిన్లను కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటే చాలు.. చిన్న పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు చూస్తున్నారు.
ఇట్లు రణస్థలి తెలుగు రివ్యూ: ఈ మధ్యకాలంలో సినిమాలు చిన్నవా, పెద్దవా అని ప్రేక్షకులు ఏ మాత్రం చూడడం లేదు. సినిమా పెద్దదైనా చిన్నదైనా కంటెంట్ ఉంటే ఆదరించేందుకు వెనకాడడం లేదు.
ఇప్పటికే తెలుగులో కూడా అనేక విభిన్నమైన చిన్న సినిమాలు ప్రేక్షకులను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ శని వారం రణస్థలి అనే ఒక మూవీ రిలీజ్ అయింది.
సూరెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనుపమ సూరెడ్డి నిర్మించిన ఈ ‘రణస్థలి’ని పరశురామ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. నీల మాధవ ధర్మ హీరోగా అమ్ము అభిరామి, చాందిని రావు.. లు హీరోయిన్లుగా ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
కధ (STORY) పరిశీలిస్తే:
తల్లి లేని బసవ(నీల మాధవ ధర్మ)ని అతని తండ్రి(సమ్మెట గాంధీ) అల్లారుముద్దుగా పెంచుతూ మంచి చదువు చదివిస్తాడు. తనకు మరదలు వరుసయ్యే అమ్ములు(చాందిని)తో వివాహం కూడా జరిగిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో అమ్ములు మరణిస్తుంది.
దీంతో అమ్ములు మరణానికి కారణమైన వారందరినీ మట్టుపెట్టాలని బసవ నిర్ణయం తీసుకుంటాడు.అందుకోసం ఇంటికి కూడా రాకుండా అడవిలోనే కాపు కాస్తూ తన భార్య ప్రేమకు గుర్తు కారణమయిన అందరినీ ఎలా మట్టుపెట్టాడన్నది సినిమా కధ.
బసవ భార్య అసలు ఎలా మరణించింది?
బసవ భార్య అమ్ములు మరణానికి కారణం ఎవరు?
వారి మరణాన్ని బసవ ఏ విధంగా ప్లాన్ చేశాడు?
బసవకు అసలు ఈశ్వరి(అమ్ము అభిరామి) ఎలా పరిచయం అయ్యింది?
వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ గా ఉంటే మీరు తప్పకుండా ఈ రణస్టలి సినిమా చూడవచ్చు, ఈ సినిమా కంటెంట్ పెద్ద తెర మీద చూస్తేనే బాగుంటుంది.
కధ కథనం (SCREEN – PLAY) పరిశీలిస్తే:
తెలుగులో చాలా రివెంజ్ డ్రామా సినిమాలో వచ్చాయి, అలాంటి వాటిలో ఈ రణస్థలి కూడా ఒకటిగా నిలుస్తుంది. ఎంతో అపురూపంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతి కిరాతకంగా చంపిన వారిని ఒక సాదాసీదా వ్యక్తి ఎలా చంపాడు అన్నదే రణస్థలి కధ.
ఇలా చిన్న పాయింట్ కధే అయినా దర్శకుడు కధనం (Screen – Play) తో రెండున్నర గంటలు సీటీకి అటుక్కునే లా మయా చేశాడు.
సినిమా లో చిన్నచిన్న లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయినా ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేయడంలో దాదాపుగా సినిమా టీం సక్సెస్ అయింది. దానికి తోడు సినిమా ఆద్యంతం ఒక అడవి లాంటి లొకేషన్ లో చేయడం కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.
ప్రస్తుత సినిమా ల లో సిటీ లైఫ్ మాత్రమే చూపిస్తున్న నేటి తరుణంలో విలేజ్ లైఫ్ విలేజ్, కల్చర్ ఎలా ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం చేయడం వలన దర్శకుడు ని అభినందించాలి. కొన్ని సీన్స్ లో ఉన్న లోపాలు సంగతి పక్కన పెడితే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది.
నటుల నటన పరిశీలిస్తే:
ఈ సినిమాలో బసవ పాత్రలో నటించిన నీల మాధవ ధర్మ తన నటనతో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
అమ్ములు పాత్రలో నటించిన తెలుగు అమ్మాయి చాందిని రావు, ఈశ్వరి పాత్రలో నటించిన అమ్ము సహా ఇతర కీలక పాత్రలలో నటించిన అందరూ తమ పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో సమ్మెట గాంధీ కీలక పాత్రలో నటించారు. ఆయన సినిమా మొత్తాన్ని తన వాయిస్ తోనే నడిపించారు. ఇక సినిమాలో నటించిన మిగతా నటీనటులు అందరూ కొత్తవారే అయినా అనుభవం ఉన్నవారిలా నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:
సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు కొత్తవాడే అయినా చాలా చక్కగా సినిమా తెరకు ఎక్కించాడు. అనుభవం ఉన్న దర్శకుడిలాగే సినిమా మొత్తాన్ని తీర్చిదిద్దాడు. చిన్న చిన్న లోపాలు సంగతి పక్కన పెడితే సినిమా అయితే దర్శకుడి ప్రతిభకు పట్టం కడుతుంది.
జాస్టి బాలాజీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొంచెం రక్తపాతం షాట్స్ తగ్గించి ఉంటే ఇంకా డీఫెరెంట్ గా ఉండును.
సినిమాకి సంగీతం అందించిన కేశవ్ కిరణ్ సాంగ్స్ కి బాగానే ఉన్నాయి. అదేవిధంగా నేపథ్య సంగీతం చాలా సన్నివేశాల్లో సినిమాకి బాగా ప్లస్ అయ్యే విధంగా సాగింది ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో నేపధ్య సంగీతం బాగా కుదిరినట్టే చెప్పాలి.
ఈ రణస్థలి సినిమా ఫైట్ మాస్టర్స్ కూడా తమదైన శైలిలో ఫైట్స్ డిజైన్ చేశారు. రక్తపాతం తో భయం కల్పించేలా ఈ ఫైట్స్ సాగాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టే ఉన్నాయి.
18FMovies టీం ఒపీనియన్ :
ఈ రణస్థలి తెలుగ మూవీ ఆద్యంతం ట్విస్టులతో సాగుతుంది. తెలుగు లో కొంచెం రా అండ్ రస్తిక్ సినిమాలు తక్కువ. కానీ ఈ రణస్థలి రా అండ్ రస్తిక్ గా సాగుతుంది. హింస రక్తపాతం ఇష్టపడని వారు రణస్థలి పక్కన పెట్టచ్చు కానీ సస్పెన్స్, రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడే వారంతా చూసి ఆనందించదగిన మూవీ ఇది.
రక్త పాతం పారే రణస్థలి
18F MOVIES RATING: 2.75/5
* కృష్ణ ప్రగడ,