వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి క్లాప్ కొట్టిన సురేష్ బాబు!

IMG 20250815 WA0244 scaled e1755259539484

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు ప్రసిద్ధులు ఎట్టకేలకు కొత్త సినిమా కోసం చేతులు కలిపారు.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. దీంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే చిత్రానికి తొలి అడుగు పడింది.

సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకులలో కూడా వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమా పట్ల ఎంతో ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన కథా శైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేష్ ను చూడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్ పేరుగాంచారు. ఇప్పుడు త్రివిక్రమ్ మరో ఆకర్షణీయమైన, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.

IMG 20250815 WA0242

సుప్రసిద్ధ హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఇది అరుదైన, మాయాజాల కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. త్రివిక్రమ్ శైలి కథలో వెంకటేష్ ను వెండితెరపై చూడటానికి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *