VENKAT PRABHU Special Interview: కస్టడీ’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. ఆడియన్స్ చాలా ఎక్సయిట్ అవుతారు అంటున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు

venkat prabhu 2 Copy e1683730252309

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయిక గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాల తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

venkat prabhu

శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు మా 18f మూవీ  విలేకరుతో  సమావేశం సమావేశం ఆయినప్పుడు  కస్టడీ విశేషాలని పంచుకున్నారు. ఆ విశయాలు మీ కోసం.. !

costody poster 4 Copy

కస్టడీ జర్నీ ఎలా మొదలైయింది ?

కోవిడ్ సమయంలో ఈ కథ ఆలోచన వచ్చింది. అప్పుడే రాసుకున్నా. ఈ కథ ఆలోచన కు స్ఫూర్తి మలయాళం సినిమా నయట్టు. అయితే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ వుండవు. తెలుగు తమిళ ప్రేక్షకుల కోసం చేసిన్నపుడు కమర్షియల్ ఎలిమెంట్స్ వుండాలి. పెద్ద ఆశయాలతో వున్న ఒక సాధారణ కానిస్టేబుల్ కథ చెప్పాలనేది ఆలోచన.

అలా రాయడం మొదలుపెట్టాను. అలా కస్టడీ పుట్టింది. ‘లవ్ స్టొరీ’ లో ఒక పాట చూశాను. అందులో నాగచైతన్య ఈ పాత్రకు సరిపోతాడనిపించింది. నాగచైతన్యకు కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. అలాగే నిర్మాత శ్రీనివాస గారు జాయిన్ అయ్యారు. ఆయనకి నాతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని వుంది. అలా జర్నీ మొదలైయింది.

కస్టడీ లో ప్రేమకథ కూడా వుంటుందా ?

venkat prabhu 3

శివ ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్. తనకి కుటుంబం వుంటుంది. అలాగే ప్రేమగా కూడా వుంటుంది. సినిమా శివకి వచ్చిన సమస్యతో మొదలౌతుంది. తనది కాని సమస్య తను ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ సినిమా ఎడ్జ్ అఫ్ సీట్ థ్రిల్లర్ లా వుంటుంది. తెలుగు, తమిళ ఆడియన్స్ అభిరుచికి తగట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఫేస్డ్ గా వుంటుంది.

costody arvind swamy

అరవింద్ స్వామీ గారికి పెద్ద ఇమేజ్ వుంది కదా ?

స్క్రీన్ పై చైతు కంటే పవర్ ఫుల్ గా కనిపించే వ్యక్తి కావాలనే ఆలోచనతో అరవింద్ స్వామీ గారిని తీసుకోవడం జరింగింది. అంత పవర్ ఫుల్ వ్యక్తిని ఎలా కంట్రోల్ చేస్తాడనే ఎక్సయిట్ మెంట్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర కూడా పవర్ ఫుల్ గా వుంటుంది.

హీరో నాగచైతన్య మీ కస్టడీ లో  నటన గురించి ?

custody poster 1

నాగచైతన్య అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో కొత్త చై ని చూస్తారు. నా సినిమాల్లో హీరోలని డిఫరెంట్ గా చూపించడానికి ఇష్టపడతాను. ఇందులో కూడా చై చాలా కొత్తగా కనిపిస్తారు. యాక్షన్ ని చాలా యూనిక్ గా డిజైన్ చేశాం. అన్నీ ఫ్రెష్ గా వుంటాయి.

కస్టడీ కి మ్యూజిక్ ఎంత బలం చేకూర్చుతుంది?

venkat prabhu Copy

ట్రైలర్ లో వినే వుంటారు. ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా నెక్స్ట్ లెవల్ లో మ్యూజిక్ చేశారు. కస్టడీ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్. చాలా యూనిక్ సౌండ్ వింటారు ప్రేక్షకులు.

మానాడు లో పొలిటికల్ పార్టీ గురించి వుంది.. కస్టడీ లో ముఖ్యమంత్రి పాత్ర చూపించారు? అదే యూనివర్స్ లో ఉంటుందా ?

లేదండీ. తమిళనాడు లో కూడా ఇదే ప్రశ్న అడిగారు. కస్టడీ ది డిఫరెంట్ వరల్డ్.

రెండు భాషల్లో చేయడం ఎలా అనిపించిది ?

costody tamil poster

చాలా కష్టమైన టాస్క్ ఇది. ప్రతి షాట్ రెండు సార్లు సీజీ చేయాలి. డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, రెండు భాషల్లో సెన్సార్లు,.. ఒకటి కాదు.. దాదాపుగా రెండు సినిమాలు తీసినట్లే. మెంటల్ గా ఫిజికల్ గా చాలా శ్రమ పడాల్సి వుంటుంది.

ఈ సినిమాకి ‘శివ’ అనే టైటిల్ ని పరిశీలించారా ?

నేను శివ సినిమాకి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు అందులో పాత్ర పేరు శివ అయినప్పుడు అదే పేరు పెట్టాలని అనుకున్నాను. అయితే చైతు వద్దు అని చెప్పారు. అది కల్ట్ క్లాసిక్. చాలా పోలికలు వస్తాయని అన్నారు.

costody krithi Copy

హీరోయిన్ కృతిశెట్టి పాత్ర గురించి ?

ఇందులో కృతి పేరు రేవతి. చాలా అద్భుతంగా చేసింది. తన పాత్ర కథలో కీలకంగా వుంటుంది. నేను రాసుకున్న పాత్రకు తగ్గట్టు గా స్క్రీన్ పై కనిపించింది.

పాటలకు, డ్యాన్సులకు ఎంత ప్రాధాన్యత వుంటుంది ?

costody chaitu krithi Copy

ఓపెనింగ్ సాంగ్ వుంటుంది. అలాగే ఒక పాటని రెట్రో స్టయిల్ లో షూట్ చేశాం. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

ఒక పెద్ద ప్రాజెక్ట్ వుంటుంది. త్వరలోనే చెబుతాను.

ఆల్ ది బెస్ట్ విక్రమ్ ప్రభు గారు అండ్ థాంక్స్,

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *