వీరసింహారెడ్డి సినిమా రివ్యూ: బాలయ్య వూర మాస్ ఫ్యా క్సన్ యాక్షన్ సెంటిమెంట్ డ్రామా !

సింహా రెడ్డి రివ్యూ e1673464983644

మూవీ : వీరసింహరెడ్డి 

విడుదల తేదీ : జనవరి 12, 2023

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్, అజయ్ ఘోష్ తదితరులు

దర్శకుడు : గోపీచంద్ మలినేని

నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్

సంగీత దర్శకులు: థమన్ ఎస్

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ

ఎడిటర్: నవీన్ నూలి

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ (VeeraSimhaReddy Movie Review):

వీర sinha రెడ్డి 2

గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం  నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో తెలుగు వారి సంక్రాంతి కానుకగా  వస్తున్న  సినిమా ‘వీర సింహారెడ్డి’.  ఈ సినిమా ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది.

చాలా రోజుల తర్వాత బాలకృష్ణ సీమ ఫ్యాక్సన్ బాక్ డ్రాప్ లో నటించిన ఈ వీరసింహరెడ్డి సినిమా  ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీస్ టీం రివ్యూ లో చదివి తెలుసుకుందామా !

కధ ను పరిశీలిస్తే (story line): 

veerasimhareddy trailer out 1

వీర సింహా రెడ్డి (సీనియర్ బాలయ్య) రాయలసీమకి దేవుడు లాంటి మనిషి. పులిచర్ల ప్రాంతానికి అండగా నిలబడుతూ.. తన పర్సనల్ లైఫ్ ని త్యాగం చేసి సీమ మంచి కోసం అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు.

వీర సింహారెడ్డికి సవతి చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) అంటే ప్రాణం. ఆమె కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. అనుకోని సంగటనలో భానుమతి ప్రేమించిన శేఖర్ (నవీన్ చంద్ర ) హత్య కావడం తో, శేఖర్ హత్య లో తన అన్న వీరసింహరెడ్డి ప్రమేయం ఉంది అని నమ్మి భానుమతి  వీర సింహారెడ్డి చావు కోరుతూ శత్రు ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్ ) ని పెళ్ళాడుతుంది.

ప్రతాప్ రెడ్డి తో కలిసి భానుమతి  ముప్పై ఏళ్లుగా వీరసింహరెడ్డి చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు.. ఇస్తాంబుల్‌లో జయసింహా రెడ్డి (వీరసింహరెడ్డి కొడుకు) తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈషా (శ్రుతి హాసన్‌)తో జయసింహా ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

ఆ సమయంలో జయసింహాకి తండ్రి ఉన్నాడు అని,  తన కోడుకి కి తండ్రి వీర సింహారెడ్డి గురించి తల్లి మీనాక్షీచెప్పి వీరసింహరెడ్డి ని ఇస్తాంబుల్ రమ్మని చెప్తుంది.

అప్పుడు వీరసింహరెడ్డి కి కొడుకు ఉన్నాడు అని తెలిసి ఏమి చేశాడు ?

అసలు తండ్రి కొడుకులు ఎందుకు దూరం అయ్యారు ?,

 చెల్లి భానుమతి, అన్న వీరసింహా రెడ్డిని ఎందుకు చంపాలి అనుకుంటుంది?,

భానుమతి ప్రతాప్ రెడ్డి ని ఎందుకు పెళ్లిచేసుకోంది ?

ప్రతాప్ రెడ్డి కి వీర సింహారెడ్డి కి మద్య గొడవ ఏంటి ?

శేఖర్ భానుమతి ల ప్రేమను వీరసింహరెడ్డి అంగీకరించాడా ? వ్యతేరేకించాడా ?

అసలు శేఖర్ ను ఎవరు చంపారు ?,

జయసింహా రెడ్డి తన తండ్రి కోసం ఏం చేశాడు ?

మీనాక్షీ – వీరసింహరెడ్డి ఎందుకు దూరం అయ్యారు ?

అనేటి ప్రశ్నలు మీకు ఇంటరెస్ట్ గా ఉంటే వెంటనే టిక్కెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి. మా సినిమా సమీక్షలు  చాలా క్లుప్తంగా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి కానీ మొత్తం కధను చెప్పి మీ సినిమా ఇంటరెస్ట్ ని పాడుచేయడం మా ఉద్దేశం కాదు.

కధ లో కధనం పరిశీలిస్తే (screen – Play):

veerasimhareddy trailer nalakrishna 1

దర్శకుడు గోపీచంద్ మలినేని సీమ ఫ్యాక్సన్ బాక్ డ్రాప్ లో  మాస్ ఎలిమెంట్స్ తో కధ రాసుకొన్నప్పటికి స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్ తో, కొన్ని చోట్ల ఈ పవర్ ఫుల్ మాస్ డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు.

అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం  చేసినప్పటికీ అవి లాజిక్ లేక వెరే బాట పట్టాయి. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.

స్టోరీ పరంగా మరియు ఎన్నుకొన్న ఆర్టిస్ట్ ల పరంగా, ఇప్పటివరకూ రుచి చూపించిన టిజర్, ట్రైలర్ ద్వారా వీరసింహరెడ్డి అంటే అద్భుతమైన కధ కలిగిన సినిమా గా  ప్రేక్షకులకు  పూర్తి స్థాయిలో ఇంట్రస్ట్ పుట్టించి సినిమా స్క్రీన్ ప్లే లో ను సీన్స్ రాసుకోవడం లోను తడబడి అన్నా – చెల్లిల సెంటిమెంట్ మిక్స్ చేసి ఏదో అనుకోని ఏదో తీసినట్టు చేశాడు.

దర్శకుడు మలినేని గోపీచంద్ చాలా ఎలిమెంట్స్ ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో అంటే  బాలకృష్ణ ఎలివేసన్ కు తమన్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కలిపి తన దర్శక ప్రతిభను పక్కన పెట్టి  సినిమా రేంజ్ ను కొంత తగ్గించాడు. మొత్తానికి సినిమా నిండా యాక్షన్ ఉన్నా.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం లేదు.  ఆ యాక్షన్ సినిమా కు  ఉపయోగపడదు. అలాగే, కథలోని మెయిన్ ఎమోషన్ కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు. చాలా వరకూ స్క్రీన్ ప్లే లోపం తో కధ ను నడిపించడం చాలా లోపం ఉంది.

నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

veerasimhareddy trailer nalakrishna 3 1

హీరో : బాలయ్య బాబు అఖండ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా లో  వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో తన మాస్ అండ్ క్లాస్  యాక్టింగ్ తో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లాంటి కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించిన బాలయ్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

హీరోయిన్: గా నటించిన శ్రుతి హాసన్ తన గ్లామర్ తో తన పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. కానీ శృతి పాత్ర ఇంట్రడక్సన్ సీన్స్ చాలా బోరింగ్ గా అనిపించాయి.

మరో హీరోయిన్  గా నటించిన హనీ రోజ్ నటన చాలా బాగుంది. ఆమె మంచి నటి అని ఈ సినిమా నిరూపించింది. శృతి కంటే హనీ రోజ్ పాత్ర నిడివి కొంచెం ఎక్కువ గా ఉన్నట్టు అనిపిస్తుంది.

వీరసింహరెడ్డి చెల్లిగా నటించిన  వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో  పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా విశ్రాంతి ట్విస్టు లో మరియు రెండవ అంకం ( సెకండ్ హాఫ్) లో వచ్చే ఓ ముఖ్యమైన సీన్ లో ఆమె నటన చాలా బాగా ఆకట్టుకుంది. బాలకృష్ణ కి సారి సమానంగా అద్భుత నటనతో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ తన ఊర మాస్ నటనతో మెప్పించాడు. ముఖ్యంగా తన అసలు రూపం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ కు చెప్పే సన్నివేశంలో దునియా విజయ్ నటనను మెచ్చుకోకుండా ఉండలేము.

మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర కూడా ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. మొత్తమ్మీద బాలయ్య మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

veerasimhareddy trailer sruthi hasan 1 2

దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ మాత్రం బాగుంది. అయితే, ఆయన రాసిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్లమరి చెత్తగా ఉంది.

సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన సంగీతం లో వచ్చిన పాటలు జై బాలయ్య, సుగుణ సుందరి, మాస్ మొగుడు, మా బావ మనోభావాలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా  కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కట్టుకునేలా ఉంది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

18f మూవీస్ టీం ఒపీనియన్:

గోపీచంద్ at వీర సింహా రెడ్డి tittle launce

నటసింహం నందమూరి బాలకృష్ణ తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. శ్రుతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. కానీ, రెండవ అంకం లో వచ్చే ఫ్లాష్ బాక్ స్టోరీ  స్లో నేరేషన్ తో  బోరింగ్ గా  సినిమాకి మైనస్ అయ్యింది.  ఓవరాల్ గా ఈ పవర్ ఫుల్ సీమ ఫ్యాక్సన్ యాక్షన్ డ్రామాలో యాక్షన్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి  ఫుల్ మాస్ మీల్స్ లా ఉంటాయి.

ఇంకా ఈ సినిమాకు మాటలు రాసిన బుర్రా సాయి మాధవ్ గురించి మాట్లాడుకోవాలి. బుర్రా మాటలు బాలయ్య నోట బుల్లెట్స్‌లా దూసుకుని వచ్చాయి.

అయితే కొన్ని డైలాగ్‌లు మాత్రం కథతో సంబంధం లేకుండా బాలయ్య పొలిటికల్ అజెండాని దృష్టిలో పెట్టుకుని రాసినట్టే అనిపిస్తాయి.

వాటిలోనించి కొన్ని డైలాగ్స్ మీ కోసం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

ఓక మినిస్టర్ ని ఉద్దేశించి…. ‘వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు.. గౌరవించడం మన బాధ్యత’ అని డైలాగ్ కొడతాడు బాలయ్య. ఇలా జగన్  ప్రభుత్వాన్నిగెలికే డైలాగ్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి చెప్పిన డైలాగ్.

‘‘ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్?

ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు.,

జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు.,

పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు.,

నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు.,

పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు… 

బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో.. వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్..’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ లు ఆంధ్ర లోని  అధికార పార్టీని  కెలికినట్టే ఉంటుంది.

ఇంకా జగన్ సర్కార్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు పాయింట్ అవుట్ చేస్తూ..

సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర స‌ృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు.. .

బలం చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువా..’ లాంటి డైలాగ్‌లు కూడా ఆంధ్ర ప్రదేశ్ లోని  అధికార పార్టీపై ఎక్కుపెట్టిన బాణాల్లాగే అనిపిస్తుంది. ఈ డైలాగ్స్ సినిమా కధతో సంభందం లేకపోయినా  సందర్బం చూసుకొని బాలయ్య చేత చెప్పించారు దర్శక రచయితలు.

టాగ్ లైన్: వీర సింహం  గాండ్రింపు ఫ్యాన్ పార్టీ కి ఫాన్స్ కు మాత్రమే. 

18f Movies రేటింగ్: 2.25 / 5 

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *