ఎ మూహర్తాన అలా వైకుంటాపురంలో సినిమా లోని ఒక సాంగ్ కి పదుల మిలియన్ యూష్ వచ్చేవో కానీ అప్పటి నుండి సంగీత దర్శకుడు థమన్ కు ఓ కొత్త అలవాటు మొదలైంది.
ఆదేంటంటే తన సొంత సినిమా పాటల ప్రమోషన్ కు తానే కవర్ సాంగ్ లు చేయడం. దాని కోసంఆ సినిమా ప్రోడుకర్స్ తో లక్షలకు లక్షలు ఖర్చు చేయించడం.
అలా వైకుంఠపురములో సినిమాఈ ట్రిక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది, అయితే ఇలా చేయడం ఒక విధంగా సినిమా కు ప్రమోషన్ గా ఉపయోగ పడుతుంది.
సినిమా పాటను విడుదలకు ముందే జనంలోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ కవర్ సాంగ్స్ బాగా పనికి వస్తాయి. అలా చేయడం వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్ కూడా వస్తాయి.
కానీ ఇందులో ప్రాబ్లం ఏమిటంటే పెద్ద హీరో ల పెద్ద సినిమాలకు ఓపెనింగ్ తేవడానికి మరీ ఇంతలా ఖర్చు చేయాల్సిన పని లేదుగా అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఎస్ ఎస్ థమన్ ఒక్క కవర్ సాంగ్ చేయడానికి అలవైకుంఠపురములో టైమ్ లోనే పాతిక లక్షల వరకూ ప్రొడ్యూసర్స్ తో ఖర్చుచేయించాడు అంట.
ఆ ఖర్చు మహేష్ సర్కారువారి పాట టైమ్ కు డబుల్ అయ్యింది ఆట. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బాలయ్య బాబు వీరసింహారెడ్డి సినిమా కోసం కూడా కవర్ సాంగ్ లు చేయడం మొదలు పెట్టారు తమన్ మ్యూజిక్ బ్యాచ్.
జై బాలయ్య అనే సాంగ్ కోసం చాలా భారీగా ఖర్చుకు వేనకాడకుండా కవర్ సాంగ్ చేయించినట్లు వార్త బయటికి వచ్చింది. దీంతో పైకి ఏమీ అనలేకపోయినా, అంత ఖర్చు ఏమిటి అని మైత్రి సంస్థ నిర్మాతలు ఫీలవుతున్నట్లు బోగట్టా.
ఇలాంటి కవర్ సాంగ్స్ కల్చర్ ఇక్కడితో అయిపోయేది కాదు. వీరసింహారెడ్డి లో ఇంకా చాలా పాటలు ఉన్నాయి, వాటికి కూడా ఇంకా చాలా ఖర్చు వుంటుంది అని నిర్మాతలను ప్రిపేర్ చేస్తున్నారు అంట.
ఈ విశయం వాల్తేర్ వీరయ్య మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ వద్దకు వెళ్తే వాల్తేరు వీరయ్య ప్రొడ్యూసర్స్ కూడా మైత్రి మూవీస్ కాబట్టి తనకు కూడా కవర్ సాంగ్స్ చేసే అవకాశం ఇవ్వండి అని అడిగితే ?
చూడాలి, ఈ ఆర్టికల్ రాసే టైమ్ కి మా దృస్తికి అలాంటి న్యూస్ రాలేదు. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్నట్టు ప్రస్తుతం హీరో ఫాన్స్ కాంపిటేసన్ ఫీక్స్ లో ఉంది.
దేవి శ్రీ ప్రసాద్ కూడా కవర్ సాంగ్ మొదలు పెడితే అది ఇంకో లెవెల్ లో వుంటుంది కదా !. వెయిట్ అండ్ సీ.