VD13 Movie Tittle & First Look soon : 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్ రాజు సినిమా!

IMG 20230927 WA0033 e1695817175948

 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీడీ 13గా పిలుస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

IMG 20230927 WA0107

వీడీ 13 నుంచి షూటింగ్ ప్రోగ్రెస్ ను మేకర్స్ ఇవాళ వెల్లడించారు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వారు తెలిపారు. వీడీ 13 సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్లాక్ బస్టర్ ఇమేజ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద క్రేజ్ పెంచుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

IMG 20230927 WA0033

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్

సంగీతం : గోపీసుందర్

ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ

నిర్మాతలు : రాజు – శిరీష్

రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *