మెగా కుటుంబం అంతా ఇటలీ లో వరుణ్ లావ్ ల పెళ్లి ఏర్పాట్లులలో చాలా బిజీ గా ఉన్నారు. మెగా ఫ్యామిలీ లో మళ్ళీ పెళ్లి భాజాలు మోగడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఎక్కడో దేశం కానీ దేశం లో పెళ్లి జరుగుతుండటం తో కొంచెం నిరూత్స్హం లో ఉన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలాగే ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల వివాహ మహోత్సవం కోసం రెండు కుటుంబాలు కూడా ఇటలీ లో ఉన్నారు అన్నది అందరికీ తెలిసిందే. మెగా స్టార్ చిరు అయితే చిన్న పిల్లవాడిలా అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి చూస్తున్నట్టు సమాచారం.

ఇపుడు ఈ మెగా వెడ్డింగ్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ బయటకి వచ్చాయి. వరుణ్ తల్లి తండ్రులు నాగబాబు, పద్మజ లు, అలాగే లావణ్య త్రిపాఠి తల్లి తండ్రులు దియోరాజ్ మరియు కిరణ్ త్రిపాఠి లు వధు వరులు ఇద్దరికీ, నవంబర్ 1న వివాహం జరుపుతున్నట్టుగా తెలిపారు. మరి ఈ వేడుకలో ఉదయం 11 గంటలకి హల్దీ తరువాత పూల్ పార్టీ అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి మెహేంది ఫంక్షన్ చేయనున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ లావ్ ల పెళ్లి ముహూర్తం నవంబర్ 1 మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకి, అనంతరం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో రిసెప్షన్ స్టార్ట్ కానుండగా ఈ వేడుకలో రెండు కుటుంబాల సన్నిహితులు సుమారు 150 మంది వరకూ ముఖ్య అతిధులు గా పాల్గొననున్నారని సమాచారం.
వరుణ్- లావ్ ల పెళ్లి సంభందించి మరంత సమాచారం కోసం 18fms మరియు 18fmovies లో చూస్తూ ఉండండి.