మూవీ: వారసుడు (తమిళ వారిశు )
విడుదల తేదీ : జనవరి 14, 2023
నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, జయసుధ, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సుమన్, శరత్‌కుమార్, ప్రభు, సంగీత మరియు ఇతరులు
దర్శకుడు : వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హర్షిత
సంగీత దర్శకులు: థమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
వారసుడు సినిమా రివ్యూ (Vaarasudu Movie Review):

సినీ ప్రేక్షకులకు దిల్ రాజు ఈ సంక్రాంతి కి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానుకగా తమిళ్ లో ముడురోజుల ముందే వారిశు గా విడుదల చేసినా తెలుగు వారికోసం ఈరోజు “వారసుడు” ని థియేటర్స్ లో విడుదల చేశారు.
ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఎంతో మంది అగ్ర తారాగణం నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తమిళ మాతృక వారిశు ని తెలుగు ఆడియెన్స్ కోసం వారసుడు గా తెచ్చినా చిరంజీవ వీరయ్య, బాలయ్య వీరసింహరెడ్డి ముందు ఈ తమిళ వారసుడు ఎంతమేర ఆకట్టుకుందో మా 18 f మూవీ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందామా !
కధను పరిశీలిస్తే (story line):

ఇక కథ లోకి వస్తే.. రాజేంద్ర (శరత్ కుమార్) కి ముగ్గురు కొడులు జై, అజయ్, విజయ్ (శ్రీకాంత్, శ్యాం, విజయ్). మూడోవాడైన విజయ్ నాన్న రాజేంద్ర ముద్ర లేకుండా తన స్వంత ఆలోచనలతో బిజినెస్ లో వెదగాలి అని ఇంట్లో నాన్న తో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.
విజయ్ తాను సొంతగా ఎదగాలని ఒక స్టార్టప్పె యాప్ డెవలప్ చేసికొని దానికి ఇన్వెస్టర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మిగిలిన కొడుకులిద్దరూ రాజేంద్ర కంపెనీలో కీలక స్థానాల్లో పని చేస్తుంటారు.
రాజేంద్ర(శరత్ కుమార్) తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన వారసులు అయినటువంటి అజయ్ ( శామ్), జై ( శ్రీకాంత్ లకు ఇవ్వాలని అనుకుంటాడు. మరి వారితో పాటుగా తనకి ఉన్న మూడో వారసుడు విజయ్ రాజేంద్ర(విజయ్ జోసెఫ్) తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంది లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు కాబట్టి తండ్రి ఆలోచనలో పడతాడు.
అనుకోని సంగటనాలతో ఎంతో ఆప్యాయంగా ఉండే తమ కుటుంబం ముక్కలవుతుంది తన తండ్రి సమస్యల్లో ఉన్నారు అనే సమయంలో విజయ్ ఓ స్టాండ్ తీసుకుంటాడు.
ఇక అక్కడ నుంచి విజయ్ తన కుటుంబం కోసం ఏం చేస్తాడు?
రష్మికా ఎవరు ? రాజేంద్ర ఇంటితో సంబధం ఏమిటి ?
విజయ్ తండ్రి రాజేంద్ర తో ఎందుకు గొడవ పడతాడు ?
శ్యామ్, శ్రీకాంత్ లకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమిటి ?
వారాసుల కధ లో ప్రకాష్ రాజ్ పాత్ర ఏమిటి ?
రాజేంద్ర కి వచ్చిన కస్టమ్ ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ వారసుడు చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.
కధ లో కధనం పరిశీలిస్తే (screen – Play):

ఈ వారసుడు చిత్రంలో బాగా డిజప్పాయింట్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది స్లో స్క్రీన్ -ప్లే అండ్ నిడివే అని చెప్పాలి. సినిమాలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది. నార్త్ ఇండియా ఫ్యామిలీ రిచ్ టివి సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తాది.
ఇలాంటి ఫీలింగ్ కలగడానికి ముఖ్యంగా ఇలాంటి సీన్స్ మన తెలుగు సినిమాలలో చాలానే చూసేసాము. దిల్ రాజు ప్రొడక్షన్ లోని బృందావనం కూడా అల్మోస్ట్ ఇలాంటి సీన్స్ తో నే ఉంటుంది. కాకపోతే ఆ సినిమా పాయింట్ వేరు, ఈ వారసుడు సినిమా పాయింట్ వేరు.
ఇంకా వారసుడు కధనం ఆద్యంతం ఆకట్టుకునే ఎంగేజింగ్ సీన్స్ లేకపోవడం అని చెప్పాలి. దీనితో చాలా సన్నివేశాలు బోర్ గా అనిపిస్తాయి. ఎంత విజయ్ రష్మిక ఉన్నా ఏదో తెలియని బోరింగ్ వెంటాడుతూ ఉంటుంది.
అక్కడక్కడా కొన్ని చోట్ల ఓకే తప్ప మిగతా సినిమా అంతా సో సో గానే అనిపిస్తుంది. ఇక సినిమాలో కథ కూడా అంత కొత్తగా ఏమీ అనిపించదు. అనేక సినిమాల్లో చూసినట్టే రొటీన్ గానే ఉంటుంది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ లాంటి పాత్ర మరింత బలంగా డెఫెరెంట్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.
అలాగే మరికొన్ని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే అనేక చోట్ల విజువల్స్ అంత నాచురల్ గా కూడా అనిపించవు.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడు వంశీ వర్క్ గురించి చెప్పాలి అంటే విజయ్ పై పలు ఎలివేషన్ సీన్స్ మంచి కేజ్రీగా డిజైన్ చేశాడు. ఇక సినిమాలో మరో హైలైట్ సీన్స్ ఉన్నాయి అంటే అవి విజయ్ మరియు యోగిబాబు ల కామెడి సీన్స్ అని చెప్పాలి.
ఈ కామిడీ ట్రాక్ బాగా వర్కవుట్అయ్యింది. వీరి మధ్య ప్రతి ట్రాక్ సినిమాలో హిలేరియస్ గా ఉంటుంది. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి తాను కాస్త రొటీన్ డ్రామానే ఎంచుకున్నా కాస్త ఎంటర్టైనింగ్ నరేషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇది పూర్తి స్థాయిలో క్లిక్ అయ్యినట్టు అనిపించదు.
వారసుడు చిత్రంలో విజయ్ ని సరికొత్తగా మనం చూడవచ్చు తన మార్క్ ఈజ్ అండ్ స్టైల్ ఈ సినిమాలో కనిపిస్తాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రెజెంటేషన్ లో విజయ్ సాలిడ్ ప్రెజెన్స్ తో కనిపిస్తాడు. అలాగే తన సింగిల్ లైన్ డైలాగ్స్ బాగా కుదిరాయి.
విజయ్ కామెడీ టైమింగ్ కూడా సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. వీటితో పాటుగా మెయిన్ గా పలు ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇక సాంగ్స్ లోవిజయ్ ఎనర్జీ లెవెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుంది.
హీరోయిన్ రష్మికా కి సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అక్కడక్కడా సీన్స్ పాటలు మినహా ఆమె పాత్ర సినిమాలో ఉపయోగం లేదు
ఇక విజయ్ తో పాటుగా సినిమాలో కనిపించిన అగ్ర తారాగణం శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శామ్ ఎస్ జె సూర్య, సంగీత లాంటి నటులు తమ పాత్రల్లో సమాన ప్రాముఖ్యత తో మంచి నటన కనబరిచారు.
ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జయసుధ గారి గురించి, ఏ సినీమాలోనైనా అమ్మ పాత్ర ఉంది అంటే అది జయసుధ ఒక్కరే న్యాయం చేయగలరు అనే లా చాలా న్యాచురల్ గా నటించారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

ఈ వారసుడు చిత్రం నిర్మాణం గురించి ముందుగా మాట్లాడుకుంటే దిల్ రాజు గురించే, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉంటాయి. కానీ సాంకేతిక వర్గంలో వి ఎఫ్ ఎక్స్ టీం పై ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది.
థమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి అంటే తన లోని బెస్ట్ వర్క్నితమిళ సినీ ప్రేక్షకులకు రుచి చూపించాడు అని చెప్పాలి. చాలా సీన్స్ కానీ పాటలు కానీ విజువల్ గా ఇంప్రెస్ చేస్తాయి. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఏమి ఉండక పోవచ్చు.
కార్తీక్ పలని సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. భారీ బడ్జెట్ సినిమా గనుక అన్నీ చాలా రిచ్ సెట్స్ అద్భుత లైటింగ్ తో విజువల్ ఫీస్ట్ గా ఉంది.
ఎడిటింగ్ మాత్రం బాగాలేదు. చాలా సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ మరియు మాటలు బాగున్నాయి .కానీ నిడివి తగ్గించి నరేషన్ ని ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉంటే కొంచెం ఇంటరెస్ట్ క్రియేట్ అయ్యేది.
18f మూవీస్ టీం ఒపీనియన్:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “వారసుడు” లో దళపతి విజయ్ అన్ని కోణాల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ, తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే సినిమా లు చాలా ఉన్నాయి కాబట్టి ఈ వారసుడు ఓటిటి టివి ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అవ్వవచ్చు.
ఓవరాల్ గా వారసుడు సినిమా గురించి మాట్లాడుకొంటే చోట్ల ఎమోషన్స్ కామెడీ వర్కవుట్ అవుతాయి. కానీ సినిమాలో నిడివి పెద్ద సమస్య అని చెప్పాలి. చాలా అనవసర సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది.
టాగ్ లైన్: ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఫ్యామిలీ చూడాలి.
18f Movies రేటింగ్: 3.25 / 5
* కృష్ణ ప్రగడ.