Varalaxmi Sarathkumar’s Sabari Movie Release date locked: వరలక్ష్మీ శరత్ కుమార్‌తో నటించిన ‘శబరి’ విడుదల ఎప్పుడంటే !

IMG 20240407 WA0128 e1712486246528

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి‘. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”సరికొత్త కథాంశంతో తీసిన సినిమా ‘శబరి’. కథ, కథనాలు ఇన్నోవేటివ్ గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా.

IMG 20240407 WA0129

ముఖ్యంగా ఆమె నటన ‘వావ్’ అనేలా ఉంటుంది. తెలుగు, తమిళ వెర్షన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. అవుట్ పుట్ పట్ల మేం చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా మాకు అంతలా నచ్చింది. మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి అయ్యాయి. ‘వరల్డ్ ఆఫ్ శబరి’ పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది” అని చెప్పారు.

నటీనటులు:

వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

IMG 20240407 WA0127

సాంకేతిక బృందం:

ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు – నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *