ఆదిపర్వం దర్శకుడి తో వరలక్ష్మీ శరత్ కుమార్ కొత్త చిత్రం !

InShot 20250129 190320816 e1738157685955

సీనియర్‌ నటుడు శరత్‌కుమార్ కూతురిగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, విలన్ పాత్రలతో ఆక‌ట్టుకుంటోంది వరలక్ష్మి. న‌టిగా సౌతిండియా భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతోంది.

IMG 20250129 WA0043

ఈ క్ర‌మంలో ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి ద‌ర్శ‌త్వంలో ఓ తెలుగు సినిమా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ స‌బ్జెక్టు కోసం వ‌ర‌లక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో వ‌ర‌లక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయ‌నుంది.

IMG 20250129 WA0192

భారీ బ‌డ్జెట్‌తో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులను తీసుకోబోతున్నార‌ట‌. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా సంజీవ్ మేగోటి తెర‌కెక్కించ‌నున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *