వరలక్ష్మీ శరత్ కుమార్‌తో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ నిర్మిస్తున్న ‘శబరి’ చిత్రీకరణ పూర్తి

shabhari movie stills vara 6 e1670858125838

నటిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ... విలక్షణ పాత్రలు, వరుస విజయాలతో దూసుకు వెళుతున్న టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ”మా ‘శబరి’ చిత్రీకరణ పూర్తయింది. మహేంద్ర గారి లాంటి నిర్మాత లభించడం మా అదృష్టం. సినిమా కోసం ఆయన చాలా ఖర్చు చేశారు. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని దర్శకుడు అనిల్ తెరపైకి తీసుకొచ్చారు.

shabhari movie stills వరా

మేము చాలా లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది. ‘శబరి’లో ప్రధాన పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల్లో డబ్బింగ్ చెప్పడం ప్రారంభిస్తా. త్వరలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం” అని చెప్పారు.

shabhari movie stills vara 2 1

చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ “ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి గారు నిర్మాతల నటి. ఆమెతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.

shabhari movie stills వరా 1

చిత్ర దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ… “కొత్త కథను తీసుకుని కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కించాం. ఈ చిత్రం ఒకరకంగా థ్రిల్లర్ జానర్ మూవీ అయినప్పటికీ… సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయి.

సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, శబరి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్ కూడా చక్కగా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా” అని అన్నారు.

shabhari movie stills vara 2

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

సాంకేతిక బృందం:
ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, పబ్లిసిటీ డిజైనర్: సుధీర్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు – నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *