aadi sabdham movie look e1671047508841

కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా.. రెండు పాత్రలలో అలరిస్తున్న డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

aadi vaisaali e1671047542463

సూపర్‌హిట్‌ ‘వైశాలి’ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో రెండోసారి చేతులు కలిపారు. విజయవంతమైన కాంబో చాలా కాలం తర్వాత రాబోతున్న ఈ చిత్రాన్ని రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

aadi pinisetti స్టిల్స్

మేకర్స్ ఈ చిత్రానికి ‘శబ్దం’ అనే టైటిల్ ప్రకటించారు. టైటిల్ పోస్టర్ టైటిల్ లానే ఆసక్తిని కలిగిస్తుంది. పోస్టర్ లో భారీ సంఖ్యలో గబ్బిలాలు చెవికి చేరుకోవడం, టైటిల్ సౌండ్ వేవ్‌గా రూపొందించారు. ఈ అద్భుతమైన పోస్టర్ ద్వారా చిత్ర బృందం సినిమా జానర్‌ని తెలియజేసింది. ఆది, అరివళగన్ ‌ల మొదటి చిత్రం వైశాలి లానే ‘శబ్దం’ కూడా సూపర్‌ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ గా ఉండబోతోంది.

aadhi pinisetti birthday

‘శబ్దం’ ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అరుణ్ బత్మనాభన్ కెమెరా మెన్ గా పని చేస్తుండగా, స్టార్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాబు జోసెఫ్ ఎడిటర్ గా మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

aadi pinisetti still

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: ఆది పినిశెట్టి

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం, లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్

నిర్మాత: 7G శివ

బ్యానర్లు: 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్

సహ నిర్మాత: భానుప్రియ శివ

సంగీత దర్శకుడు: థమన్ ఎస్

డీవోపీ: అరుణ్ బత్మనాభన్

ఎడిటర్: సాబు జోసెఫ్

ఆర్ట్ డైరెక్టర్: మనోజ్ కుమార్

స్టంట్స్: స్టన్నర్ సామ్

స్టిల్స్ : డి. మానేక్ష

మార్కెటింగ్ & ప్రమోషన్: డిఇసి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్ బాలకుమార్

పీఆర్వో: వంశీ-శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *