2014 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైరా ఎమ్మెల్యే గా గెలుపొంది టిఆర్ఎస్ పార్టీ లోకి చేరి సేవలు అందించిన మదన్ లాల్ గుండె పోటు తో మే 27న మృతి చెందాడు. మధన్ లాల్ మృతి పట్ల బాధ పడుతూ పోస్ట్ పెట్టారు ఫిల్మ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ ”

2016 లో నేను చేసిన మొదటి సినిమా ఎందరో మహానుభావులు సినిమా లో గెస్ట్ రోల్ అడగగానే మదన్ లాల్ గారు యాక్ట్ చేశారు” ఆ రోజు నుండి మొన్నటి వరకు టచ్ లో ఉండే వారు, చాలా యాక్టివ్ పర్సన్.

ఎప్పుడు నన్ను మొటివేట్ చేసే వ్యక్తి, తను ఒక ఎమ్మెల్యే ఐన సరే చాలా సామాన్య వ్యక్తి లా నాతో ఉండే వారు అని ” మీకు నేను ఓటు వెయ్యలేదు, మీ నియోజకవర్గం కాదు, బంధువులం కాదు..
2016 నుండి మొన్నటి వరకు నాతో ఎందుకు జర్నీ చేశారు..ఎందుకు ఇలా మధ్యలో వదిలేసి వెళ్లారు సర్..😭😭 బాధ గా ఉంది సర్ మీరు లేరు అనే వార్త వింటే😭 we miss u sir ” అని పోస్ట్ పెట్టి సంతాపం తెలిపారు.