Vaaradhi Movie Review & Rating: ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా సాగిన వారధి !

varadhi Review e1738072413992

చిత్రం: వారధి, 

విడుదల తేదీ : డిసెంబర్ 27 th , 2024,

నటీనటులు :అనిల్ అర్కా ,విహారిక చౌదరి, ప్రశాంత్ మడుగుల, రిధి తదితరులు., 

డైరెక్టర్ :డైరెక్ట‌ర్ శ్రీకృష్ణ  ,

ప్రొడ్యూసర్ : పెయ్యాల భారతి, మణికలా రాధ, ఎం.డి. యూనస్,

సినిమాటోగ్రఫీ : శక్తి జె.కె. ,

మ్యూజిక్ : షారుఖ్ షేక్ ,

మూవీ: వారధి రివ్యూ  ( Vaaradhi Movie Review) 

భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధాన్ని తెరమీద ఆవిష్క‌రించిన చిత్రం ‘వారధి’. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వారధి’ మూవీ తాజాగా మూవీ (శుక్ర‌వారం) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అయింది.

ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది?

యూత్‌ను ఎట్రాక్ట్ చేసిందా?

అంచ‌నాలు నిల‌బెట్టుకుందా?

అనే విశయాలు తెలియాలి అంటే మా 18F మూవీస్ టీం అందించిన ఈ వారధి మూవీ సమీక్ష చదివి తెలుసుకోవలసిందే !

vaaradhi movie review by 18 fms 2

కధ పరిశీలిస్తే (Story Line): 

ఈ వారధి చిత్రం ఓ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్. కొత్త‌గా పెళ్ల‌యిన చంద్రు (అనిల్ ఆర్కా) – న‌క్ష‌త్ర (విహ‌రిక చౌద‌రి) ఇద్ద‌రి మ‌ధ్య కొద్ది రోజుల్లోనే మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థాలు చోటు చేసుకుంటాయి. న‌క్ష‌త్రకు అనుకోకుండా విన‌య్ (ప్ర‌శాంత్)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. భ‌ర్త యాసిడ్ దాడికి గుర‌వుతాడు. న‌క్ష‌త్ర జీవితంలోకి న‌కిలీ వ్య‌క్తి ప్ర‌వేశిస్తాడు.

ఇంత‌కీ ఆమె ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఎలా చిక్కుకుంటుంది?

భ‌ర్త‌కు తిరిగి ద‌గ్గ‌ర‌వుతుందా? లేదా ?, 

అనేది తెలుసుకోవాలంటే వారధి సినిమా మీ దగ్గరలొని థియేటర్ లో చూడాల్సిందే.

కధనం పరిశీలిస్తే (Screen – Play):

దర్శకుడు, కథా రచయిత అయిన  శ్రీకృష్ణ ఈ వారధి కథని ట్విస్టులతో కూడిన  శైలి, భావోద్వేగాలతో  రాసుకోవడం ఈ సినిమా ప్రధాన బలం. కొన్ని ఎమోష‌న్ సీన్లు కూడా చ‌క్క‌గా కుదిరాయి. ఉత్కంఠ‌రేపేలా ట్విస్టుల‌ను డైరెక్ట‌ర్ చ‌క్క‌గా తెర‌కెక్కించారు.

కధ కు తగ్గ కధనాన్ని రాసుకోవడం, నటి నటుల పాత్రలను తీర్చి దిద్దిన విధానం బాగుంది. కాకపోతే పాత్రధారులు అందరూ కొత్తవారు కాబట్టి ప్రేక్షకులు ఈ కరధి సినిమా కు కనెక్ట్ అవ్వదానికి కొంత టైమ్ పట్టవచ్చు.

vaaradhi movie review by 18 fms 1

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

డైరెక్ట‌ర్ శ్రీకృష్ణ త‌ను రాసుకున్న క‌థ‌కు ఒక ఎమోషనల్ కు ఒక ఎమోషనల్ కధనం తో అందరూ మెచ్చేలా తెర‌పై చూపించ‌డంతో స‌క్సెస్ అయ్యాడు. ఈ త‌రం యువ జంట‌లు చేసే పొర‌పాట్ల‌ను చ‌క్క‌గా చూపించారు. హీరోహీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ సీన్లు యూత్ ఆడియ‌న్స్‌ను ఎట్రాక్ట్ చేస్తాయి.

అనిల్ అర్కా – చంద్రగా: చంద్ర పాత్రలో అనిల్ అర్కా భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు.
విహారిక చౌదరి – నక్షత్రగా: నక్షత్ర పాత్రలో విహారిక ఆకట్టుకునే నటన చేశారు, కథకు కీలకమైన భావోద్వేగాలు పంచారు.
ప్రశాంత్ మడుగుల – వినయ్‌గా: ప్రతినాయకుడిగా ప్రశాంత్ పాత్రలో కఠినత్వాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రిధి పాత్ర కథకు మరింత బలాన్ని చేకూర్చింది.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

సంగీతం దర్శకుడు షారుఖ్ షేక్ గీతాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను మంత్ర‌ముగ్దులను చేస్తాయి.

సినిమాటోగ్రఫీ శక్తి జె.కె. విజువల్స్. సినిమా ఫీల్‌ను కొత్తగా తీర్చిదిద్దాయి.

నిర్మాతలు: పెయ్యాల భారతి, మణికలా రాధ, ఎం.డి. యూనస్. నిర్మాణ విలువల పరంగా బాగా నిర్వహించారు.

రచయిత: నాగేంద్ర పలగాని. డైలాగ్స్ ప్రాముఖ్యతను అందించారు.

vaaradhi press meet pics 1 1 e1735323625739

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

భావోద్వేగాలు, సస్పెన్స్ కలగలిసిన అందమైన థ్రిల్లర్ ఈ వారధి చిత్రం. ముఖ్యంగా ఈ త‌రం యువ ప్రేక్షకులకు బాగా న‌చ్చుతుంది. కొత్త నటీనటులతో చేసిన ఈ చిత్ర ప్రయోగం సినిమా ప్రేక్షకుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది.

ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించేలా ఉంది ఈ వారధి చిత్రం. రొమాంటిక్ థ్రిల్లర్ కధలు ఇష్ట పడే ప్రేక్షకులు వెంటనే థియేటర్ కి వెళ్ళి చూడండి.

చివరి మాట:ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ !

18F RATING: 2.75 / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *