USTAAD shoot schedule complets: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటెన్స్ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్  పూర్తి అయ్యింది ఆట !  

ustaad pawan kalyan e1696077223962

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న  మాస్ యాక్షన్ సిన్మా  ‘ఉస్తాద్ భగత్ సింగ్’  యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది అని చిత్ర నిర్మాణ సంస్థ తెలియ జేసింది . కొద్ది  రోజుల్లోనే మరో  ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో వస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

 ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ తీరుతో ఉస్తాద్  చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హరీష్ శంకర్ చాలా హ్యాపీ గా ఉన్నారు.  గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో పాటు కొన్ని నెలల క్రితం విడుదల చేసిన  సినిమా గ్లింప్స్ కి అన్నివైపుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్  సిన్మా మంచి  బజ్ ని ట్రేడ్ వర్గాలలో క్రియేట్ చేస్తోంది.

మరి ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ చేస్తున్న పాత్ర  పోలీసు కావడం తో అభిమనుల్లో భారీ అంచనాలు వేర్పాడ్డాయి. గబ్బర్ సింగ్ లో పోలీస్ గా అలరించిన పవర్ స్టార్ ఈ ఉస్తాద్ లో కూడా అభిమానులను, సినీ ప్రేక్షకులను  అలరించబోతున్నారు.

 ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.  అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తుండగా, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

తారాగణం:

పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం : హరీష్ శంకర్.ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈవో: చెర్రీ
స్క్రీన్ ప్లే: కె దశరధ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: అయనంక బోస్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
అడిషినల్ రైటర్: సి. చంద్రమోహన్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చంద్రశేఖర్ రావిపాటి, హరీష్ పై
పీఅర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *