ఉప్పు కప్పురంబు రివ్యూ:
నటీనటులు : సుహాస్ పాగోలు, కీర్తి సురేష్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్, రవితేజ, విష్ణు O.I, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, ప్రభావతి వర్మ తదితరులు..,
దర్శకత్వం : అని I.V.శశి
నిర్మాతలు : రాధిక లవు
సినిమాటోగ్రఫీ : దివాకర్ మణి
సంగీతం : స్వీకర్ అగస్తి
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
1. పరిచయం:
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తాజా తెలుగు వెబ్ సిరీస్ “ఉప్పు కప్పురంబు“, విభిన్న కాన్సెప్ట్‌తో, గ్రామీణ నేపథ్యం మీద ఆసక్తికర కథనం నడిపించే ప్రయత్నం చేసింది.
మహానటి ఫేం కీర్తీ సురేష్, కలర్ ఫోటో సూహాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ హ్యూమన్ డ్రామా + కామెడీ మిక్స్ ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
2. కథ & కథనం :
1990ల కాలంలో “చిట్టి జయపురం” అనే ఊరిలో శ్మశానం విషయంలో తలెత్తిన మానవీయ సమస్య కథా కేంద్రం. కొత్త శవాన్ని పూడ్చే స్థలం లేకపోవడం నుంచి మొదలైన చిన్న సమస్య ఎలా ఊరంతా కలిపే సంఘటనగా మారుతుంది అనేది ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను తెర మీద సమర్థులైన నటులు పలికించిన తీరు బాగుంది.
మొదటి భాగం వినోదంగా సాగుతుంది కానీ కథ లోతు లోకి వెళ్లేది రెండవ భాగంలో మాత్రమే. క్లైమాక్స్ లో హృదయాన్ని తాకే ఎమోషనల్ టర్న్ ఉంది, అయితే అంతకన్నా ముందునుంచి నెమ్మదిగా నడవడం కొంత బోర్‌ను కలిగించవచ్చు.
కథ కథనం రాసుకొనే తప్పుడు అద్భుతంగా అనిపించినా స్క్రీన్ మీద అంతగా ఎమోషన్ వర్క్ అవుట్ కాలేదు. ఎందుకనో కొన్ని సీన్స్ అయితే ల్యాంత్ ఎక్కువ అనిపించింది.
3. దర్శకత్వం & నటి నటులు ప్రతిభ:
దర్శకుడు ఐ.ఏ. శశి నెమ్మదిగా కథను ఓ బోర్డు మీద పెట్టినట్టు నడిపించినా, చివరికి భావోద్వేగం అద్భుతంగా డెలివర్ చేశారు.
సందర్భోచితమైన కామిడి టైమింగ్ తో కూడిన కథనం తో ఫ్యామిలీ, పిల్లలను మెప్పించే ప్రయత్నం చేశాడు.
కీర్తీ సురేష్ – “అపూర్ణ” పాత్రలో ఆమె చాలా కొత్తగా కనిపించింది. అయితే కొన్ని చోట్ల ఎమోషనల్ ఓవరాక్షన్ కనిపించింది.
సుహాస్ – “చిన్నా” పాత్రలో స్పష్టంగా స్టెప్ప్ అప్ చేశాడు. హాస్యం, ఎమోషన్ రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేశాడు.
సహాయక పాత్రల్లో బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, జయమాన్విత వంటి వారు సహజంగా మద్దతుగా నిలిచారు.
4. టెక్నికల్ టీమ్ ప్రతిభ:
సంగీతం (స్వీకార్ అగస్తి): బీజీఎం చాలా కీలకంగా పనిచేసింది, ముఖ్యంగా క్లైమాక్స్ లో అద్భుతంగా ఉంది.
సినిమాటోగ్రఫీ (దివాకర్ మణి): వాడిన కలర్స్, ఫ్రేములు పల్లెటూరు వాతావరణాన్ని అందంగా చూపించాయి.
ఎడిటింగ్: (శ్రీజిత్ సారంగ్) కొన్ని సన్నివేశాల్లో ల్యాంగ్త్ కట్ చేయాల్సిన అవసరం కనిపించింది.
5. 18F Movies Opinion:
‘ఉప్పు కప్పురంబు’లో ఒక చిన్న ఊరి సమస్య నుంచి పెద్ద మానవతా సందేశం రావడం ఈరోజుల్లో అరుదుగా చూస్తున్నం. కథనం పూర్తిగా కనెక్ట్ కాకపోయినా, క్లైమాక్స్ భావోద్వేగం హార్ట్‌హిటింగ్. మాస్, కమర్షియల్ లవర్స్‌కి ఇది నచ్చకపోవచ్చు కానీ “కథకు నిబద్ధత” అనే కోణం చూడాలనుకునేవాళ్లకు ఇది ఓసారి చూడదగిన మంచి ప్రయోగం.
ఇంట్లో ఉన్న అందరూ కలిసి ఓటీటీలో చూసేలా ఉన్న ఈ సిరీస్, అంచనాలు పెంచుకోకుండా చూస్తే బాగా మెప్పిస్తుంది. స్క్రీన్‌ప్లే కొంచెం స్లోగా ఉన్నా, ఎమోషనల్ పాయింట్ డెలివరీ పక్కాగా ఉంటుంది.
⭐18F రేటింగ్: 3.25 / 5
📌 సిఫార్సు: ఓ కొత్త అభిప్రాయంతో కూడిన కథనాలు ఇష్టపడే వారికి తప్పక చూడదగ్గ ఓటీటీ వెబ్ సిరీస్.
* కృష్ణ ప్రగడ.