Upasana Konidela starts Athamma s Kitchn: సురేఖ కొణిదెల కొసం ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన ఉపాసన కొణిదెల

IMG 20240218 WA0165

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారుఉపాసన.

సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు.

IMG 20240218 WA0166

చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను “అత్తమ్మ కిచెన్” ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుంది.

ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా “అత్తమ్మ కిచెన్”ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు.

IMG 20240218 WA00951

వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా “అత్తమ్మ కిచెన్” నిలుస్తుంది. సురేఖ కొణిదెల పుట్టినరోజున వారు ఈ వెంచర్‌కు ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు.

ఆతమ్మ కిచెన్ గురించి :

సురేఖ కొణిదెల పుట్టినరోజున ప్రారంభించారు. ఉపాసన కొణిదెల నేతృత్వంలోని “అత్తమ్మ కిచెన్” ప్రొడక్ట్స్‌లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో ఉంది.

 

ఈ ప్రొడక్ట్స్‌ కోసం దిగువ లింక్‌లను అనుసరించండి:

వెబ్‌సైట్:

https://www.athammaskitchen.com

వాట్సప్:

https://api.whatsapp.com/send?phone=919866589955&text=Hi

 

ట్విట్టర్:

ఇన్ స్టాగ్రాం:

https://www.instagram.com/athammaskitchen

ఫేస్ బుక్:

https://www.facebook.com/people/Athammas-Kitchen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *