UGRAM MOVIE TELUGU REVIEW: మాస్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఈ నరేష్ ఉగ్రం సినిమా !

ugram review e1683310182382

మూవీ: ఉగ్రం (UGRAM)

విడుదల తేదీ : మే 05, 2023

నటీనటులు: ‘అల్లరి’ నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు

దర్శకులు : విజయ్ కనకమేడల

నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది

సంగీత దర్శకులు: శ్రీ చరణ్ పాకల

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

 ఉగ్రం సినిమా రివ్యూ (UGRAM Movie Review):

ugram teaser launch 8

కామిడీ కి  కేరాఫ్ అడ్రసు అయిన అల్లరి నరేష్, మొన్నటి నాంది సినిమా తో నటుడు అనిపించుకున్నా, నేటి ఉగ్రం సినిమా తో మాస్ యాక్సన్ హీరో అనుపించుకొంటాడు అనుటలో సందేశం లేదు.

నరేష్ హీరోగా మిర్న మీనన్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ఉగ్రం. ఈ ఉగ్రం సినిమా తెలుగు  ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీ టీం  సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కధ ను పరిశీలిస్తే (story line):

సిఐ శివ కుమార్ (అల్లరి నరేశ్) చాలా  సిన్సియర్ అండ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా కార్ ఆక్సిడెంట్ తర్వాత మిస్ అయిన తన భార్య (మిర్నా) మరియు తన కూతురు కోసం సీరియస్ గా వెతుకుతూ ఉంటాడు.

రోడ్డు యాక్సిడెంట్ కారణంగా మిస్ అయిన తన భార్య, పిల్లలను వెతికే క్రమంలో ఇలాగే నగరంతో పాటు పాటు రాష్ట్రంలో ఎంతో మంది మిస్ అవుతున్నారు అని తెలుసుకొని, ఈ మిస్సింగ్ కేస్ లు ఆన్నిటి వెనక ఎవరి హస్తం ఉందా అని తెలుసుకొని ఆచార్య పోతాడు.

అసలు సిఐ శివ కుమార్ భార్య, కూతురు ఎలా మిస్ అయ్యారు ?,

అలాగే సిటీలో మిస్ అయిన వందలాదిమంది ప్రజలు ఏమైపోయారు ?,

ఈ మిస్సింగ్ కేసులు వెనుక ఉన్నది  ఎవరు ?,

చివరకు సిఐ శివ కుమార్ ఈ మిస్సింగ్ కేసులను ఎలా సాల్వ్ చేశాడు ?

తన భార్య కూతుర్ని ఎలా సేవ్ చేసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

ugram teaser launch 5

విజయ్ కనకమేడల దర్శకత్వం లో వచ్చిన రెండవ సినిమా ఈ ఉగ్రం.  తీసుకున్న కధ మంచిదే అయిన కధనం  (స్క్రీన్ ప్లే ) లో విషయం లేకపోవడం సినిమా ఫలితం కొంచం దెబ్బతింది. ఉగ్రం  సినిమాలో చెప్పుకోవడానికి మంచి  పాయింట్ ఉన్నా గానీ, కొన్ని సీక్వెన్స్ ఇంట్రస్ట్ గా సాగలేదు. ఈ సినిమా మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్ ) లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో, వర్కౌట్ కాని విచారణ డ్రామాతో సాగితే , రెండవ అంకం ( సెకెండ్ హాఫ్ ) సాగతీత సన్నివేశాలతో సాగుతుంది.

కథ కు అవసరమైన సీన్స్ కంటే అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. అలాగే కథ పరంగా వచ్చే కొన్ని కీలక సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

సాధారణ ప్రజలు మిస్ అయితే.. పోలీసులు దైర్యాన్ని ఇస్తారు. కానీ, పోలీస్ భార్యపిల్లలే మిస్ అయితే.. ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుంది ?, ఒక పోలీస్ ఫ్యామిలీ సమస్యలో ఉంటే.. తనను తన ఫ్యామిలీని అలాగే మిస్ అయిన మిగిలిన ప్రజలను ఆ పోలీస్ ఎలా సేవ్ చేసుకున్నాడు?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? అనే కోణంలో సాగిన ఈ ఉగ్రం సినిమా కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది.

విజయ్ కనకమేడల అల్లరి నరేష్ కాంబో లో వచ్చిన రెండవ సినిమా ఈ ఉగ్రం. కొంచెం హై ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా తో కధ నడిపిన విదానం బాగుంది.  అయితే సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో హై యాక్షన్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ రాసుకోవడం బాగుంది.  ఓవరాల్ గా విజయ్ కనకామెడల తన రెండవ సినిమా విజ్ఞాన్ని దిగ్విజయంగా దాటినట్టే.

అల్లరి నరేశ్  తన పరిపక్వతమైన నటనతో  ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. మెయిన్ గా హీరో – ఇజ్రాల గెటప్స్ లో ఉన్న విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్స్ లో నరేష్ ఉగ్రరూపం చూపించాడు.

 హీరోయిన్ గా నటించిన మిర్నా మీనన్  తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో బాగానే నటించింది. మరో కీలక పాత్రలో నటించిన ఇంద్రజ కూడా బాగానే నటించింది.

శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వారి నటన బాగున్నాయి. అలాగే ప్రధాన పాత్రలో నటించిన శత్రు కూడా చాలా బాగా నటించాడు.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

ugram review 2

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే..

సిద్ధార్థ్ జె సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్ లో కూడా విజువల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి.

ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఇంకొంచం ట్రిప్ చేసి ఉంటే ఇంకా బాగుండేది,

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్స్ అయితే బీజీం తోనే అద్భుతంగా ఉన్నాయి. ఉగ్రం టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.

నిర్మాతలు సాహు గారపాటి & హరీష్ పెద్ది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

18F మూవీస్ టీం ఒపీనియన్:

ugram teaser launch 9

ఉగ్రం  సినిమా లో ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా సీన్స్, మరియు క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఐతే, కథనంలో  కంటెంట్ లేకపోవడం, అలాగే ప్లే బోర్ గా సాగడం, కొన్ని సీక్వెన్స్ లో లాజిక్స్ లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి.

నరేష్ ప్రదర్శించిన ఉగ్ర రూపం  యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో కనెక్ట్  అవ్వడం అనేది కొంచెం కస్టమైన పనే. మాస్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు.

టాగ్ లైన్: నరేష్ ఉగ్ర శిఖ రాగ్రం !

18F Movies రేటింగ్: 3,25  / 5 

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *