Ugly Story’ Movie Glimpse Released as Intensified Thriller: రొమాంటిక్, ఇంటెన్సిఫైడ్ థ్రిల్లర్‌ గా ‘అగ్లీ స్టోరీ’ మూవీ గ్లింప్స్ ! 

IMG 20231225 WA0084 e1703493695801

 

లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లు వస్తున్న సినిమా అగ్లీ స్టోరీ. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

IMG 20231225 WA0080

ఈ సందర్భంగా దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ : లక్కీ మీడియా రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న అగ్లీ స్టోరీ మూవీ తో 2024 హిట్టు కొట్టబోతున్నాము. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్ గారు, సుభాషిని గారు, కొండా లక్ష్మణ్ గారు నన్ను నా కథను నమ్మి ఈ సినిమాని నిర్మించారు.

వారు నాకు ఇచ్చిన సహకారంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే డైలాగ్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది.

IMG 20231225 WA0079

ఇలాంటి డైలాగులు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఇంకా ఎన్నో ఉండబోతున్నాయి. ఈ గ్లింప్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో ముందు ముందు వచ్చే టీజర్ ట్రైలర్ మరియు సినిమాని ఇంకా చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్నాము.

అతి త్వరలో టీజర్, ట్రైలర్ తో మిమ్మల్ని కలుస్తాము. ఫస్ట్ లుక్ నుంచి మమ్మల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారు ఈ గ్లింప్స్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారు అలాగే మమ్మల్ని ఆదరించి సినిమాని ఇంకా మంచి బిగ్గెస్ట్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాము.

IMG 20231225 WA0086

నటీనటులు :

నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా మరియు ప్రజ్ఞా నయన్.

సాంకేతిక వర్గం:

 

నిర్మాతలు : బెక్కెం వేణుగోపాల్,సి హెచ్. సుభాషిణి,కొండా లక్ష్మణ్,కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : ప్రణవ స్వరూప్,సహ నిర్మాతలు : రాజ్, అశ్వనీ శ్రీకృష్ణ,D.O.P : శ్రీసాయికుమార్ దారా,సంగీతం : శ్రవణ్ భరద్వాజ్,ఎడిటర్ : శ్రీకాంత్ పట్నాయక్.ఆర్,ఆర్ట్ : విఠల్ కొసనం,సాహిత్యం : భాస్కరబట్ల, వరికుప్పల యాదగిరి, కడలి,స్టంట్స్ : నటరాజ్,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : శీలం రామకృష్ణ,కాస్ట్యూమ్ డిజైనర్ : పావన, హర్షిత,పి ఆర్ ఓ : మధు VR,డిజైన్స్ : విక్రమ్ డిజైన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *