Trivikram launched Sharathulu Varthisthayi: త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల!

IMG 20231021 WA0050 e1697872739184

 

స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వంలో , చైతన్య రావు భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ను ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ
మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు, షరతులు వర్తిస్తాయి చిత్రం కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా , ఈ ప్రాంతం మట్టి నుంచి వచ్చిన కథ అని ఇది మన కుటుంబ సంస్కృతిక విలువలతో నిండి ఉన్న సినిమా ఇటువంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర)
అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.

IMG 20231021 WA0051
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ
దేశంలో ఉన్న 80 శాతం మంది జీవితాలకు ఈ సినిమా అద్దం పడుతుందని, ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారని అన్నారు.

చిత్ర హీరో చైతన్య రావు మాట్లాడుతూ
మా సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ను తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ గారు ఆవిష్కరించడం తనకెంతో ఆనందాన్నిచ్చింది ఇంత బిజీ లో కూడా మాకు సమయం కేటాయించి మమ్ములను ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ గారికి , హరికృష్ణ సార్ కి ప్రత్యక ధన్యవాదలు తెలియజేశారు

IMG 20231021 WA0049

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కుమార స్వామి ( అక్షర ) మాట్లాడుతూ
ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా త్వరలోనే విడుదల కి ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ త్రివిక్రమ్ సార్ తో ఆవిష్కరించలని నా కల అని అడిగిన వెంటనే సహాయ సహకరాలు అందించిన డా మామిడి హరికృష్ణ గారికి అంగీకరించిన గురుజి త్రివిక్రమ్ గారికి ప్రత్యక ధన్యవాదాలు తెలియజేశారు.

నటి నటులు: చైతన్య రావు మాదాడి భూమి శెట్టి, నంద కిశోర్, సంతోష్ యాదవ్, పెద్దింటి అశోక్, కుమార్, మల్లేష్ బలాస్ట్,వెంకీ మంకీ,దేవ రాజ్, పాలమూర్, పద్మావతి, సీతామహాలక్ష్మీ,సుజాత దేవి,శివ కళ్యాణ్, సుజాత

 

సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: శ్రీలత – నాగార్జున్ సామల, శారదా – శ్రీష్ కుమార్ గుండా
విజయ – డా. కృష్ణకాంత్ చిత్తజల్లు

రచన – దర్శకత్వం: కుమార స్వామి (అక్షర)

మాటలు: పెద్దింటి అశోక్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె ఎడిటింగ్: సిహెచ్. వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి, సంగీతo, అరుణ్ చిలివేరు,బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ప్రిన్స్ హెన్రీ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *