NUVVE NUVVE RE RELEASE ON 4th NOV

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా  పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’.

trivikram speech 1

ఇందులో తరుణ్, శ్రియ జంటగా నటించారు. అక్టోబర్ 10కి సినిమా విడుదలై 20 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు.

NUVVE NUVVE TARUN AND SHREYA 2

స్క్రీన్ హౌస్ ఫుల్ కావడమే కాదు, ప్రతి పంచ్ – సీన్‌కు ఆడియన్స్ నుంచి ఎక్స్‌ట్రాడినరీ రెస్పాన్స్ లభించింది.

థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అదిరిందని అందరూ చెప్పారు. 

20 years nuvve nuvve 2 1 

‘నువ్వే నువ్వే’ అభిమానులకు ఓ శుభవార్త. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ప్రదర్శించనున్నారు.

sravanthi ravi kishore

‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”మా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే. ‘నువ్వే నువ్వే’ విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేసినప్పుడు వచ్చిన స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

NUVVE NUVVE MOVIE STILLS NEW 1

వెండితెరపై మళ్ళీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతి అని యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉందన్నాడు తరుణ్. ఆ సమయంలో చాలా మంది సినిమాను రీ రిలీజ్ చేయమని అడిగారు. ఇప్పటికీ అడుగుతున్నారు.

NUVVE NUVVE TARUN AND SHREYA

ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. 2కె హెచ్‌డి ప్రింట్‌తో షోస్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ స్క్రీన్స్‌లో ‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్ చేస్తున్నాం. త్వరలో థియేటర్ల వివరాలు వెల్లడిస్తాం’ అని అన్నారు.

NUVVE NUVVE TARUN

ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘నువ్వే నువ్వే’ చిత్రానికి కోటి సంగీతం అందించారు. హరి అనుమోలు ఛాయాగ్రాహకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *